Lemon: దృష్టి దోషాలు తొలగిపోయి డబ్బు రావాలంటే నిమ్మకాయలతో ఇలా చేయాల్సిందే!
నిమ్మకాయలతో కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 01:03 PM, Sun - 6 October 24

నిమ్మకాయలను ఎన్నో విధాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. ఆరోగ్యపరంగానే కాకుండా, ఆధ్యాత్మిక పరంగా కూడా నిమ్మకాయను ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే నిమ్మకాయలకు దిష్టి దోషాలను, ప్రతీత శక్తులను తొలగించే అతీత శక్తులు ఉన్నాయని చాలా మంది నమ్మకం. అందుకే చాలామంది నరదృష్టి తొలగిపోవడానికి దుష్ట దోషాలు తొలగిపోవడానికి నిమ్మకాయలతో అనేక రకాల పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. చాలా మంది వ్యాపారస్తుల దగ్గర ఒక గాజు గ్లాసులో నీళ్ళు పోసి అందులో నిమ్మకాయ ఉంచడం చూస్తూనే ఉంటాం.
ఇలా చేస్తే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందని, నరదృష్టి ద్రుష్టి దోషాలు కూడా తొలగిపోతాయని చాలామంది నమ్మకం. నిమ్మకాయను గాజు గ్లాసులో నీళ్ళు పోసి ఉంచడం వల్ల అది నెగిటివ్ ఎనర్జీ ని దూరం చేస్తుందని నమ్మకం. షాపుల ముందు ఇలా వేలాడుతూ ..తమ వ్యాపారాలను నాశనం చేయాలనే దుష్ట శక్తుల నుండి రక్షిస్తాయనే నమ్మకం. మంత్ర తతంత్రాలలో ప్రధానమైన పాత్ర నిమ్మకాయదిగా భావిస్తారు. అలాగే గురువారం ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి నాలుగు నిమ్మకాయలు, లవంగాలు తీసుకెళ్ళి పూజ చేయడం ద్వారా కష్టాలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అలాగే వ్యాపారం బాగా జరగకపోతే ఒక నిమ్మకాయను తీసుకుని షాప్ లోని నాలుగు గోడలకు ఒకసారి ఆ నిమ్మకాయను టచ్ చేసి, ఆ తర్వాత ఆ నిమ్మకాయను నాలుగు ముక్కులుగా కట్ చేసి నాలుగు దిక్కులలో ఆ నిమ్మకాయ ముక్కలను ఉంచడం ద్వారా శని బయటకు వెళ్తుందని చాలా మంది నమ్ముతారు.
అలాగే ఇంటి వాస్తు విషయంలో ఎలాంటి సమస్యలున్నా నిమ్మ చెట్టు ఉండటం వల్ల వాస్తు సెట్ అవుతుందట. ఇంట్లో ఎవరికైనా దిష్టి దోషం తగిలితే ఒక నిమ్మకాయను తీసుకుని కింద నుండి పై వరకూ వారిని చూస్తూ దిష్టి తీసి, దానిని నాలుగు సమాన భాగాలుగా కోసి, ఎవరూ లేని ఖాళీ స్థలంలో పడేయాలి. వాటిని అక్కడే పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. ఇలా చేయడం ద్వారా ఆ దిష్టి పోతుందట. నిమ్మకాయను ఒక గాజు గ్లాసులో నీటిలో వేసి ఉంచడం వల్ల చెడుని గ్రహించి, మంచిని విడుదల చేస్తుందని నమ్మకం. అలాగే శక్తికేంద్రంగా ఉంటుంది. పరిసరాలను అనుకూలంగా మారుస్తుందని నమ్మకం. కేవలం వ్యాపార ప్రదేశాల్లోనే కాదు ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చట. హాలులో ఒక టేబుల్ మీద గాజు గ్లాసులో నీరుపోసి అందులో ఒక నిమ్మకాయను ఉంచడం వల్ల ఎటువంటి ద్రుష్టి దోషాలు ఆ ఇంటి లోపలికి రాలేవుజ ధనం ఆకర్షించబడుతుందని అర్థం అంటున్నారు.