Break Coconut: కొబ్బరికాయ కొడుతున్నారా.. అయితే తప్పకుండా ఈ నియమాలు పాటించాల్సిందే?
మామూలుగా మనం పూజ చేసిన తర్వాత ఆ దేవుడికి కొబ్బరికాయను కొడుతూ ఉంటాం. నైవేద్యం పెట్టి పూజ అంతా పూర్తి అయిన తర్వాత మనం కొబ్బరికాయను కొడుతూ ఉంటాం.
- By Anshu Published Date - 11:32 AM, Mon - 8 July 24

మామూలుగా మనం పూజ చేసిన తర్వాత ఆ దేవుడికి కొబ్బరికాయను కొడుతూ ఉంటాం. నైవేద్యం పెట్టి పూజ అంతా పూర్తి అయిన తర్వాత మనం కొబ్బరికాయను కొడుతూ ఉంటాం. అయితే ఎప్పుడైతే కొబ్బరికాయ కొడతామో అప్పుడు పూజ పూర్తి అయినట్టు అని చెప్పవచ్చు. కొబ్బరికాయ కొట్టడం మంచిదే కానీ కొబ్బరికాయ కొట్టడంలో కూడా ఒక పద్ధతి ఉంది అంటున్నారు పండితులు. మరి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అయితే భగవంతుడికి కొబ్బరికాయను కొట్టే ముందు దానిని స్వచ్ఛమైన నీరుతో కడిగి ఆ తర్వాత టెంకాయ పీచు ఉన్న ప్రదేశాన్ని చేత పట్టుకొని దేవుడిని మనసులో స్మరించుకుంటూ రాతిపై కొట్టాలి. అయితే ఆ రాయి ఆగ్నేయ దిశగా ఉండేటట్లు చూసుకోవాలి. టెంకాయ కొట్టేటప్పుడు 9 అంగుళాల ఎత్తు నుండి కొట్టడం మంచిది. అలాగే చాలామంది టెంకాయ కొట్టినప్పుడు రెండు భాగాలుగా సమానంగా పగలాలి అటు ఇటు పగలకూడదు. అలా పగిలితే ఏమైనా జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటారు. కానీ అలాంటిదేమీ లేదని, టెంకాయ ఎలా పగిలినా కూడా ఏమీ కాదని అంటున్నారు పండితులు.
ఒకవేళ ఎప్పుడైనా మీరు టెంకాయ కొట్టినప్పుడు లోపల కుళ్లిపోయినట్టుగా అనిపిస్తే మీరు వెంటనే కాళ్లు ముఖం శుభ్రం చేసుకుని వచ్చి ఇంకొక టెంకాయ ఎన్నో కొట్టడం లేదంటే సర్వం సర్వేశ్వరార్పితం అని భావించి పరమాత్మున్ని108 సార్లు జపిస్తే పరిహారం అవుతుందని చెబుతున్నారు పండితులు. అలాగే ఎప్పుడైనా అభిషేకం చేసేటప్పుడు చాలామంది టెంకాయ కొట్టి దానిని విడదీయకుండా అలాగే అభిషేకం చేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం తప్పు. అలా చేస్తే ఆ టెంకాయ ఇంకా నైవేద్యానికి పనికి రాదట. కాగా కొబ్బరికాయను కొట్టి ఆ నీటిని ఒక పాత్రలోనికి తీసుకుని, కాయను వేరు చేసి వేరే ఉంచాలి. పాత్రలోని కొబ్బరి నీటిని మాత్రమే అభిషేకించాలి.
వేరుగా ఉంచిన కొబ్బరికాయ రెండు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించాలి. కొబ్బరికాయ కొట్టిన తరవాత రెండు ముక్కలకు కుంకుమ ,పసుపు లాంటివి బొట్లు పెట్టవద్దు. అలా పెడితే విరుద్ధ పూజ అవుతుంది. కొబ్బరికాయను కొట్టిన తర్వాత స్వామి వారికి నివేదన చేసాక తప్పక ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచాలి అప్పుడే పుణ్యం లభిస్తుంది. కొబ్బరికాయ కొట్టే ముందు దేవుడిని స్మరించుకుంటూ మొక్కులు మొక్కుతూ ఉంటారు. అలా మొక్కుకునేటప్పుడు టెంకాయ యొక్క జుట్టు దేవుడి వైపు పెట్టి మొక్కు పోవాలి. కొట్టేటప్పుడు మన వైపు ఉండేలా చూసుకోవాలి.