Amla Facts: ఉసిరికాయను ఆ టైమ్ లో తింటున్నారా.. అయితే ఆ దోషం చుట్టుకున్నట్లే!
Amla Facts: ఉసిరికాయ తినడం మంచిదే కానీ, కొన్ని సమయాల్లో తింటే అనారోగ్యంతో పాటు కొన్ని దోషాలు కూడా కలుగుతాయని చెబుతున్నారు. మరి ఉసిరికాయను ఎలాంటి సమయాల్లో తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:00 AM, Mon - 3 November 25
Amla Facts: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఉసిరి వల్ల ఎన్ని రకాల లాభాలు కలుగుతాయి. ఉసిరికాయ కేవలం ఆరోగ్యపరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా కార్తీకమాసంలో ఉసిరి చెట్టును ప్రత్యేకంగా పూజించడంతోపాటు ఉసిరి దీపాలను వెలిగిస్తూ ఉసిరి దీపాలను దానం చేస్తూ ఉంటారు. వీటివల్ల ప్రత్యేకమైన ఫలితాలు కలుగుతాయని నమ్మకం.
అయితే ఉసిరికాయను తినడం మంచిదే కానీ కొన్ని సమయాల్లో తినడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. మరి ఉసిరికాయను ఎలాంటి సమయాలలో తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇదివరకటి రోజుల్లో మన పెద్దలు ఆదివారం రోజున, రాత్రి సమయంలో ఉసిరికాయ తినకూడదని చెప్పేవారు. అయితే ఉసిరి తినకూడదు అన్న విషయానికి అసలు కారణాలు ఏంటి అన్నది వారికి కూడా తెలియదు. కానీ అసలు విషయం ఏంటి అన్న విషయానికి వస్తే.. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉసిరికాయ ప్రేగులలో ఉండే ఆమ్లాన్ని పెంచుతుంది.
రాత్రి సమయంలో తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. అజీర్తి చేయడం వలన గుండె మంటగా ఉండటం జరుగుతుందట. అలాగే ఉసిరి శరీరానికి శక్తిని ఉత్పత్తి చేస్తుందట. అందులో ఉండే శక్తి రాత్రి పూట మనల్ని నిద్రపోకుండా చేస్తుందట. రక్త ప్రసరణ వేగంగా ఉండటంతో రాత్రి సమయంలో నిద్ర కూడా సరిగా పట్టక ఇబ్బందులు పడతామని, అందుకే రాత్రి సమయంలో ఉసిరిని తినకూడదు చెబుతున్నారు. అలాగే ఉసిరికాయకు ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. ఇందులో సూర్య శక్తి దాగి ఉంటుందట. సూర్యుడికి ఇష్టమైన రోజైన ఆదివారం నాడు ఉసిరికి మరింత బలం చేకూరుతుందట. ఆ శక్తి ప్రభావం వల్లనే ఆదివారం నాడు ఉసిరిని దూరం పెడుతారని చెబుతున్నారు. ఆదివారం రోజు రాత్రింబగళ్ళు, సప్తమి నాడు పగటిపూట ఉసిరిక పచ్చడి తింటే అలక్ష్మీ దోషం కలుగుతుందట.