Amavasya: అమావాస్య రోజు పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకండి.. చేసారో.. అంతే సంగతులు!
అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉందని, కాబట్టి ఈరోజున తెలిసి తెలియకుండా కూడా కొన్ని రకాల పొరపాట్లు అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 06:30 AM, Thu - 25 September 25

Amavasya: హిందూమతంలో అమావాస్యకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన పూజలు పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. అలాగే కొన్ని రకాల పనులు కూడా చేయకూడదని చెబుతూ ఉంటారు. అలా కాదు అని కొన్ని చేయకూడని పనులు చేస్తే ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోక తప్పదని పండితులు హెచ్చరిస్తున్నారు. మరి అమావాస్య రోజు ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయానికి వస్తే.. అమావాస్య రోజున మాంసం తినడం మద్యం సేవించడం లాంటివి చేయకూడదట.
ఇది అశుభం అని చెబుతున్నారు. మాంసాహారం తింటే కుండలిపై ప్రతికూల ప్రభావం పెరుగుతుందట. అదేవిధంగా అమావాస్య రోజున గోర్లు కత్తిరించడం జుట్టు కత్తిరించడం లాంటివి అస్సలు చేయకూడదట. ఈ విధంగా చేస్తే పితృ దోషం వల్ల భయంకరమైన దుష్ప్రభావాలకు గురికావచ్చు అని చెబుతున్నారు. అలాగే జుట్టు తలస్నానం చేయడం కూడా చాలా సమస్యలను కలిగిస్తుందట. అలాగే చీపురు లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి, అమావాస్య రోజున చీపురు కొనుగోలు చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. ఇది డబ్బు ప్రవాహాన్ని ఆపివేస్తుందట.
ఇంట్లో ప్రతికూల శక్తి నింపుతుందని, ఆరోగ్యం కోసం ఖర్చు పెరగవచ్చని చెబుతున్నారు. అదేవిధంగా అమావాస్య రోజున తలకి నూనె రాసుకోకూడదటట. దాని బదులుగా ఈ రోజున నూనెను దానం చేస్తే అది ప్రయోజనకరంగా ఉంటుందని, నూనె శనితో ముడిపడి ఉంటుంది కాబట్టి అంతా మంచి జరుగుతుందని చెబుతున్నారు. ఇది కుండలి నుండి శని దోషాన్ని తొలగించడానికి సహాయం చేస్తుందట. చాలా మంది అమావాస్య రోజు పూజలు చేయడం మంచిది కాదని అంటూ ఉంటారు. కానీ పండితులు సలహా మేరకు ఈ రోజున పూజలు వంటివి చేయడం ప్రత్యేక పరిహారాలు పాటించడం మంచిదని చెబుతున్నారు.