Spiritual: వర్క్ డెస్క్ మీద దేవుళ్ళ ఫోటోలు, విగ్రహాలు పెట్టుకోవచ్చా?
వర్క్ డెస్క్ పై దేవుళ్ళ ఫోటోలు విగ్రహాలు పెట్టుకునేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలు గుర్తుంచుకోవాలట.
- By Anshu Published Date - 05:19 PM, Thu - 15 August 24

ఉద్యోగం చేసే వాళ్ళు దేవుడి పై ఉన్న భక్తితో ఆఫీస్ టేబుల్స్ పై వర్కింగ్ టేబుల్స్ పై దేవుడి ఫోటోలు విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు. ఉదయం వర్క్ మొదలు పెట్టేటప్పుడు ఆ దేవుళ్లకు నమస్కరించి పూజ చేసి మరీ వర్క్ ని మొదలు పెడుతూ ఉంటారు. కేవలము ఉద్యోగాలు చేసే వారు మాత్రమే కాకుండా స్టడీ టేబుల్ పై కూడా దేవుడి విగ్రహాలను ఫోటోలను పెడుతూ ఉంటారు. మరి నిజానికి ఈ వర్క్ డెస్క్ పై దేవుళ్ళ ఫోటోలు విగ్రహాలు పెట్టవచ్చో, పెట్టకూడదో ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వినాయకుడే తొలిపూజలు అందుకుంటారు. విఘ్నాలను తొలగించే వినాయకుడిని ముందుగా పూజించడం వల్ల మనం చేపట్టే పనులకు, శుభకార్యాలకు ఎలాంటి ఆటంకాలు రావని నమ్ముతారు. అయితే మీరు మీ ఆఫీసు డెస్క్ పై వినాయక విగ్రహాన్ని లేదా మీకు ఇష్టమైన దేవుడి విగ్రహాన్ని మాత్రమే పెట్టాలి. లేదంటే మీకు చెడు జరుగుతుందట. మీకు ఎలాంటి అశుభం జరగకూడదు అనుకుంటే మీరు మీ ఆఫీసు డెస్క్ పై రెండు దేవుళ్ల విగ్రహాలను ఉంచకూడదు. ఇలా రెండు దేవుళ్ల విగ్రహాలను పెడితే మీకు చెడు జరుగుతుందట. మాములుగా కుబేర విగ్రహాలు అందరి ఇళ్లలో ఉంటాయి. ఈ విగ్రహం ఉంటే ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదని చాలా మంది నమ్ముతారు.
కానీ కుబేర విగ్రహాన్ని కేవలం డబ్బు ఉండే ప్రదేశంలో లేదా పూజా గదిలోనే పెట్టాలని చెబుతున్నారు. కుబేర యంత్రాన్ని పొరపాటున కూడా ఆఫీసు డెస్క్ పై పెట్టకూడదట. కావాలనుకుంటే మీరు మీ ఆఫీసు డెస్క్ పై లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టవచ్చని చెబుతున్నారు. ఇది మీ జీవితంలో సంపదతో పాటుగా, ఆర్థిక పరిస్థితిని మెరుగ్గా ఉంచుతుందని చెబుతున్నారు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఉంటుందని చెబుతున్నారు. అలాగే మీరు ఎప్పుడూ ఆర్థిక నష్ట సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం కూడా రాదట. మీ ఆఫీసు డెస్క్ పై లాఫింగ్ బుద్ధుడి విగ్రహాన్ని కూడా పెట్టవచ్చు. అయితే లాఫింగ్ బుద్ద విగ్రహాన్ని ప్రతి రోజూ శుభ్రం చేయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇది డబ్బును మీ వైపు ఆకర్షిస్తుందట. అలాగే డబ్బుకు ఎప్పుడూ కొరత ఉండదని చెబుతున్నారు.