Pooja: పూజ సమయంలో చేయకూడనివి, చేయాల్సిన పనుల గురించి మీకు తెలుసా?
పూజ సమయంలో కొన్ని రకాల తప్పులు చేయకూడదని అలాగే కొన్ని రకాల పనులను తప్పకుండా చేయాలని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- By Anshu Published Date - 01:01 PM, Sat - 21 December 24

ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన ఉంటుందో ఆ ఇంటి లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పండితులు చెబుతూ ఉంటారు. ప్రతిరోజు దీపారాధన చేసే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెబుతూ ఉంటారు. అయితే దీపారాధన చేయడం మంచిదే కానీ చాలామంది తెలిసి తెలియక దీపారాధన చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. వాటి కారణంగా పూజ చేసిన ఫలితం దక్కక పోగా లేని కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఈ పూజ సమయంలో ఎలాంటి పనులను చేయాలి? ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఉదయాన్నే పూజ చేయాలి అనుకున్న వారు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. అలాగే సూర్యుడు అస్తమించిన తర్వాత నిద్రించాలి. నోములు, వ్రతాలు చేసే రోజు తలకు నూనె పట్టించడం దువ్వడం లాంటివి చేయకూడదు. అదేవిధంగా శని,ఆది,మంగళవారాలలో కొత్త వస్తువులను కొనుగోలు చేయడం ఇంటికి తీసుకురావడం లాంటివి అస్సలు చేయకూడదట. స్నానం చేయకుండా పోయి వెలిగించకూడదని చెబుతున్నారు. అలాగే శుక్రవారాలలో ప్రయాణాలు చేయడం మంచిది కాదట. చేయకూడదని చెబుతున్నారు. ఇతరులకు బొట్టు పెట్టే ముందు మొదట మీరు పెట్టుకుని ఆ తర్వాత ఇతరులకు బొట్టు పెట్టాలని చెబుతున్నారు.
పూజ సమయా రోజుల్లో మంచినీళ్లు మజ్జిగ మీ చేతులతో వడ్డించకూడదట. ఇతరుల నుంచి ఉప్పు నూనె తీసుకోకూడదట. గడపని కాలితో తొక్కకూడదట. గడప బయట నుంచి లోపల వస్తువుని బయటికి తీసుకు రాకూడదు. అలాగే బయట వస్తువులను గడప అవతల పెట్టరాదు. ఏదైనా వస్తువు ఇచ్చే ముందు తీసుకునే ముందు గడప అవతలికి లేదా ఇవతలకి వచ్చి మాత్రమే తీసుకోవాలి. అంతే కానీ గడప మధ్యలో నిలబడి వస్తువులను మార్చుకోకూడదు. రాత్రి భోజనంలో ఎట్టి పరిస్థితులలో పెరుగును తీసుకోకూడదని చెబుతున్నారు. ఇలా పూజలు చేసే వారు తప్పకుండా ఈ నియమాలను పాటించాలట.