Vastu Shastra: వాస్తు ప్రకారం ఇంట్లో ఈ 5 రకాల పెయింటింగ్స్ ఉంటే చాలు.. అదృష్టం మారిపోవడం ఖాయం!
Vastu Shastra: మన ఇంట్లో వాస్తు శాస్త్ర ప్రకారం ఇప్పుడు చెప్పబోయే ఈ ఐదు రకాల పెయింటింగ్స్ ఉంచుకుంటే అంతా మంచే జరుగుతుంది అని చెబుతున్నారు పండితులు.
- By Anshu Published Date - 06:30 AM, Thu - 2 October 25

Vastu Shastra: భారతదేశంలోని హిందువులు వాస్తు శాస్త్ర విషయాలను బాగానే పాటిస్తూ ఉంటారు. ఇంటి స్థలం కొనుగోలు చేసే సమయం నుంచి ఇంట్లోని వస్తువుల అమరిక వరకు ప్రతి ఒక విషయంలో వాస్తు విషయాన్ని పాటిస్తూ ఉంటారు. ఇంటిని ఏ దిశలో నిర్మించాలి? ఏ దిశలో వస్తువులను అమర్చాలి అన్న విషయాలను బాగానే పాటిస్తూ ఉంటారు. అయితే చాలామంది వాస్తు ప్రకారం ఇంట్లో రకరకాల పెయింటింగ్స్ ని పెట్టుకుంటూ ఉంటారు. వాటితోపాటు ఇప్పుడు చెప్పబోయే ఈ ఐదు రకాల పెయింటింగ్స్ ని ఉంచుకుంటే తప్పకుండా అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కాగా వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో మూడు రకాల పెయింటింగ్‌లను తప్పనిసరిగా ఉంచాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర పండితులు. ఈ పెయింటింగ్ లను ఇంట్లో ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రసారం అవుతుందట. జీవితంలో ఆనందం, సౌకర్యం, శ్రేయస్సు కొనసాగుతుందని చెబుతున్నారు. ఇంట్లో ఏనుగు పెయింటింగ్ వేయడం చాలా శుభప్రదంగా పరిగణించాలట. ఇంట్లో ఈ రకమైన పెయింటింగ్ ను వేయించినా, తీసుకొచ్చి పెట్టినా జీవితంలో స్థిరత్వం వస్తుందట. దీనితో పాటుగా రాహు, కేతువుల దశ నడుస్తున్న వారికి ఏనుగు పెయింటింగ్ వల్ల ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
ఇంట్లో ఏనుగు పెయింటింగ్ లేదా విగ్రహం ఉంచినప్పుడు, ఏనుగు తొండం పైకి ఉండేలా చూసుకోవాలట. ఇల్లు లేదా ఆఫీస్ లలో ఏనుగు పెయింటింగ్ ను ఉంచడానికి నైరుతి దిశ శుభప్రదంగా ఉంటుందట. అదేవిధంగా ఇల్లు లేదా కార్యాలయంలో కల్పవృక్షం పెయింటింగ్ వేయడం అన్నది చాలా శుభప్రదంగా పరిగణిస్తారట. ఇంట్లో ఇలాంటి పెయింటింగ్ ను వేయడం వల్ల కెరీర్ లో అభివృద్ధి ధనం వస్తుందట. ఆర్థిక పరిస్థితి బాగా లేని వారు ఇంట్లో కల్పవృక్షం పెయింటింగ్ ను ఉంచాలని చెబుతున్నారు. ఈ కల్పవృక్షం పెయింటింగ్ ను ఉత్తర దిశలో ఉంచడం చాలామంచిదని చెబుతున్నారు. అదేవిధంగావాస్తు ప్రకారం, ఇల్లు లేదా కార్యాలయంలో 7 గుర్రాల పెయింటింగ్ వేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుందట.
ఇంట్లో 7 గుర్రాల రేసు ఫోటోను ఉంచడం వల్ల ఆరోగ్యం, ధనం కెరీర్ లో మంచి అభివృద్ధి కనిపిస్తుందట. దీనితో పాటు, శత్రువుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని ఇందుకోసం ఈ ఏడు గుర్రాల రేస్ ఫోటోని తూర్పు దిశలో పెట్టడం మంచిదని చెబుతున్నారు. అలాగే బుద్ధుడి పెయింటింగ్ శాంతి, జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని ప్రసరింపజేస్తుందట. తమ గదిలో ప్రశాంతమైన సామరస్యపూర్వక వాతావరణాన్ని సృష్టించాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన పెయింటింగ్ అని చెబుతున్నారు. బుద్ధుడి పెయింటింగ్ కు అనువైన స్థానం తూర్పు గోడ. మీ లివింగ్ రూమ్ లో ఈ పెయింటింగ్ ఉంచడం మంచిదని చెబుతున్నారు. పచ్చదనం, పర్వతాలు లేదా జలపాతాలు వంటి ప్రకృతి సంబంధిత చిత్రాలు మీ గదిలో తాజాదనం, ఉత్సాహాన్ని నింపడానికి ఉపయోగపడతాయట. ఈ పెయింటింగ్స్ వృద్ధిని సూచిస్తాయని, ఒత్తిడిని తగ్గిస్తాయని, సృజనాత్మకతను పెంచుతాయని చెబుతున్నారు. ఈ ఫోటోని తూర్పు దిశలో ఏర్పాటు చేసుకోవడం మంచిది అని చెబుతున్నారు.