Tirupati Stampede : గాయపడిన వారికి వైకుంఠ ద్వార దర్శనం
Tirupati Stampede : ఈ నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుల ఆదేశాల మేరకు తీసుకోబడింది
- By Sudheer Published Date - 10:29 AM, Fri - 10 January 25

వైకుంఠ ద్వార దర్శన టికెట్ టోకెన్ల తొక్కిసలాట ఘటన(Tirupati Stampede )లో గాయపడిన భక్తులకు టీటీడీ ప్రత్యేకంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించింది. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుల ఆదేశాల మేరకు తీసుకోబడింది. మొత్తం 52 మందికి ప్రత్యేక దర్శనం అందించడంపై భక్తులు, ముఖ్యంగా గాయపడినవారు, టీటీడీని ధన్యవాదాలు తెలిపారు.
Hush Money Case : ట్రంప్‌కు షాక్.. హష్ మనీ కేసులో శిక్ష ఖరారును ఆపలేమన్న సుప్రీంకోర్టు
ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్బంగా వైకుంఠ ద్వార దర్శనం కోసం అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. వేకువ జామున 3:45 గంటలకు శ్రీవారి అభిషేక సేవ అనంతరం టీటీడీ అధికారులు భక్తులకు దర్శనాన్ని ప్రారంభించారు. ప్రముఖులు సైతం తెల్లవారుజామునే స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమం టీటీడీ ప్రొటోకాల్ ప్రకారం పూర్తి చేయబడింది. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మల్లు భట్టి విక్రమార్కలు స్వామిని దర్శించుకున్నారు. అలాగే ఏపీ మంత్రులు వంగలపూడి అనిత, సవిత, నిమ్మల రామానాయుడు, పార్థసారథిలు కూడా శ్రీవారి దర్శనంలో పాల్గొన్నారు. అంతేకాదు ఆధ్యాత్మిక గురువు రాందేవ్ బాబా, నందమూరి రామకృష్ణ, బాలకృష్ణ సతీమణి వసుంధర మరియు సుహాసిని కూడా ప్రత్యేకంగా స్వామిని దర్శించుకున్నారు.
నేటి నుండి 19 జనవరి వరకు, టీటీడీ శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని కేవలం టికెట్ లేదా టోకెన్స్ ఉన్న భక్తులకు మాత్రమే అనుమతిస్తుంది. ఈ 10 రోజుల కాలంలో శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు మరియు ప్రత్యేక దర్శనాలు రద్దు చేయబడినట్లు టీటీడీ ప్రకటించింది.