Ugadi Panchangam 2024 : ఈ ఏడాది మీ జాతకం ఎలా ఉందో ఓ లుక్ వేసుకోండి
ఇక ఉగాది వచ్చిందంటే చాలామంది ఈ కొత్త ఏడాది తమ జాతకం ఎలా ఉండబోతుందో..చూసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ప్రత్యేకంగా ఉగాది నాడు పంచాగాన్ని పండితులు విడుదల చేస్తారు
- By Sudheer Published Date - 10:59 PM, Mon - 8 April 24
చాలామంది జనవరి 01 న కొత్త ఏడాది స్టార్ట్ అని అనుకుంటారు..కానీ అసలు కొత్త ఏడాది అనేది ఉగాది (Ugadi ) తో మొదలు అవుతుంది. అందుకే తెలుగు సంవత్సరాదిని ఉగాది అని అంత పిలుచుకుంటారు. ఉగాదితోనే అన్ని పండగలు ప్రారంభం అవుతాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలలోనూ ఈ ఉగాది వేడుకలను జరుపుకుంటారు. ఉగాది రోజున అందరు ఉదయాన్నే లేచి..తల స్నానం చేసి ఇంట్లోనే పూజలు చేసుకుని ఉగాది పచ్చడి చేసుకుని తినడం ఆనవాయితీగా వస్తుంది.
ఈ ఏడాది ఉగాదిని క్రోధి నామ సంవత్సరం (Sri Krodhi Nama Samvatsara)గా పిలుచుకుంటున్నాం. క్రోధి నామ సంవత్సరం అంటే కోపాన్ని కలిగించేది అని అర్థం. ఇక ఉగాది వచ్చిందంటే చాలామంది ఈ కొత్త ఏడాది తమ జాతకం ఎలా ఉండబోతుందో..చూసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ప్రత్యేకంగా ఉగాది నాడు పంచాగాన్ని పండితులు విడుదల చేస్తారు. గ్రహాలు, నక్షత్రాలను బట్టి వీటిని తయారు చేసి ఎవరి నక్షత్రంలో ఎలా ఉండబోతుందో చెబుతారు. మరి మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
మేష రాశివారి జాతకం చూస్తే..
ఆదాయం 14, వ్యయం 14 , రాజపూజ్యం 03, అవమానం 01 గా ఉంది. ఈ ఏడాది శని గ్రహ అనుకూల ప్రభావం చేత సమాజంలో స్థాయి, పరపతి పెరుగుతుంది. విద్యా, ఉద్యోగ విషయాలలో అభివృద్ధి కానవస్తుంది. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక రంగంలో రాజకీయాల కారణంగా కొన్ని చేదు అనుభవాలు ఏర్పడతాయి. దొంగ స్వామిజీలను నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి. పొరపాటున తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నందుకు మిమ్మల్ని మీరే నిందించుకుంటారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు (ప్రమోషన్) వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. కళాసాంస్కృతిక, క్రీడా రంగాలలో మీ ప్రతిభా పాటవాలు గుర్తింపుకు నోచుకుంటాయి.
మకరరాశి వారి జాతకం చూస్తే..
ఆదాయం 14, వ్యయం 14 , రాజపూజ్యం 03, అవమానం 01 గా ఉంది. ఈ రాశివారికి ఈ సంవత్సరం కొంత వరకు శుభ ఫలితాలు అందనున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొంత వరకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సెదర, సెదరీల మధ్య చిన్నపాటి ఆత్మీయ బంధాలు పెరగడానికి ఆస్కారాలు ఉన్నాయి. నూతన అభివృద్ధి కొరకు ప్రయత్నించే వారికి అనుకూలమైన కాలం. ప్రేమ వివాహాల విషయంలో కొంత అనుకూలత ఉంటుంది. సంతాన విషయంలో కొంత వరకు సంతృప్తి పొందుతారు. సంవత్సర ప్రధమార్ధంలో కుటుంబంలో అనుకోని సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జీవనాధారమైన వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి.
తులారాశి వారి జాతకం చూస్తే ..
ఆదాయం 2 వ్యయం 8 గా, రాజపూజ్యం 1, అవమానం 5 గా ఉంది. ఈ సంవత్సరం బృహస్పతి ఎనిమిదవ స్థానంలో, శని ఐదవ స్థానంలో, కేతువు వ్యయ స్థానంలో, రాహువు ఆరవ స్థానంలో సంచరించడం వల్ల అనుకూల ఫలితాలు కంటే ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికపరంగా తులా రాశి జాతకులకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఈ సంవత్సరం వీరికి అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం కోసం సంపాదించిన దాంట్లో ఎక్కువ ధనాన్ని ఖర్చు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉండదు. ఓవరాల్ గా ఈ ఏడాది ఈ రాశి వారికీ పెద్దగా బాగోలేదు.
సింహరాశి వారి జాతకం చూస్తే..
ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2 అవమానం 2గా ఉంది. ఈ సంవత్సరంలో ఈ రాశి బృహస్పతి దశమ స్థానంలోనూ, శని సప్తమ స్థానంలోనూ, రాహువు అష్టమ స్థానంలోనూ, కేతువు వాక్ స్థానంలోను సంచరిస్తున్నారు. దీంతో ఈ రాశి జాతకులకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. మధ్యస్థం నుండి చెడు ఫలితాలున్నాయని చెబుతున్నారు. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆవేశ పూరితమైన నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలని.
కన్యారాశి వారి జాతకం చూస్తే..
ఆదాయం 5 , వ్యయం 5 , రాజపూజ్యం 5 , అవమానం 2 గా ఉంది. ఈ రాశి వారికి శని ఆరో స్థానంలో అనుకూలంగా ఉండడం వాళ్ళ జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుడు అష్టమ స్థానంలో సంచరిస్తాడు. ఆపై మే నుంచి గురుడు భాగ్య స్థానంలో సంచరించడం వల్ల కన్యారాశి జాతకులకు ధన లాభం, పేరు ప్రతిష్టలు కలుగుతాయి. ఈ ఏడాది ప్రథమార్ధం కొన్ని ఒత్తిడులు, అనారోగ్య సమస్యలు ఉన్నాయి కానీ ద్వితీయ అర్థం కన్యారాశి జాతకులకు ఆర్థికంగాను, ఆరోగ్య పరంగాను లాభదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరం చిన్న చిన్న ఇబ్బందులు మినహాయించి అంతా అనుకూలంగానే ఉంది.
వృశ్చిక రాశి వారి జాతకం చూస్తే..
ఆదాయం 8 , వ్యయం 14 , రాజపూజ్యం 4 , అవమానం 5 గా ఉంది. ఈ సంవత్సరం వృశ్చిక రాశిలో బృహస్పతి ఏడవ స్థానంలో స్థానంలో సంచరిస్తున్నారు. శని నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు. అలాగే రాహువు పంచమ స్థానంలో కేతువు లాభ స్థానంలో సంచరిస్తున్నారు. దీనిని బట్టి ఈ సంవత్సరం ఆర్థికపరంగా పురోగతి కనిపిస్తుంది. అప్పుల బాధలు తగ్గిపోతాయి. వ్యాపారస్తులకు ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రావొచ్చు. ఈ సంవత్సరం ఆర్థిక విషయాలలో కాస్త లాభదాయకం గానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఆరోగ్య అవసరాల కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
We’re now on WhatsApp. Click to Join.
కర్కాటకరాశి వారి జాతకం చూస్తే..
ఆదాయం 14, వ్యయం 2 , రాజపూజ్యం 6 , అవమానం 6 గా ఉంది. ఈ సంవత్సరం ఈరాశి వారికి అష్టమ శని ఉండడం వల్ల ఆరోగ్యసమస్యలు, ఆస్తి వ్యవహారాలలో ఇబ్బందులు, ప్రయాణాలు చేసేటప్పుడు రోడ్డుప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. శుక్రుడు అయిదవ స్థానంలో ఉండడంవల్ల ఈ రాశి జాతకులు ప్రేమ జీవితం బాగుంటుంది. వివాహానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. శని అష్టమ స్థానంలో ఉండడంవల్ల ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక ఊహించని ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది .సంపద పెరగడంతో ఆర్థిక స్థితి బలపడుతుంది. సామాజికంగాను పేరు ప్రతిష్టలు లభిస్తాయి.
వృషభరాశి వారి జాతకం చూస్తే..
ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7 ,అవమానం 3గా ఉంది. గురుడు మరియు శని శుభ స్థానాలలో ఉండటం వల్ల వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అన్ని పనులలోను విజయాన్ని సాధించే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈ సంవత్సరం సంతోషదాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరగడం, సంతానం కావాలనుకునే వారికి ఈ సంవత్సరం శుభ సమయం. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.
మిధునరాశి వారి జాతకం చూస్తే..
ఆదాయం 5, వ్యయం 5 , రాజపూజ్యం 3, అవమానం 6 గా ఉంది. గురుడు లాభ స్థానంలో, శని భాగ్య స్థానంలో, రాహువు రాజ్యస్థానంలో, కేతువు చతుర్థ స్థానంలో సంచరించడం తో ఈ రాశివారికి ఈ సంవత్సరం బాగానే ఉంది. గత సంవత్సరం కంటే విశేషమైన యోగాలతో విలాసవంతమైన జీవితం గడుపుతారు. కుటుంబ సభ్యుల నుండి అవసరమైన మానసిక మద్దతు లభిస్తుంది. ఈ సంవత్సరం కుటుంబవాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అవివాహితులకు ఈ సంవత్సరం వివాహయోగం ఉంటుంది.
ధనస్సు రాశి వారి జాతకం చూస్తే..
ఆదాయం 11 , వ్యయం 05 , రాజపూజ్యం 07 , అవమానం 05 గా ఉంది. ఈ రాశి వారికి ఈ ఏడాది ఎంతో బాగుంది. అనుకూలమైన గ్రహ ప్రభావం చేత చాలా విషయాలలో విజయం సాధిస్తారు. జీవిత సాధనకు సంబంధించి గురు గ్రహ అనుగ్రహం చేత మీ మనస్సులో ఉన్న కోరిక నెరవేరుతుంది. గురువు పంచమ, షష్ఠమ స్థాన సంచారం. రాహువు చతుర్ధ స్థాన చలనం, కేతువు దశమ స్థాన చలనం, శని తృతీయ స్థాన చలనం. గురు, శుక్ర మౌఢ్యములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పులు, ప్రమోష న్లు, బదిలీలు ఉంటాయి. కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరంగా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. గతం లో ఇచ్చిన ఋణాలు తిరిగి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి.
మీన రాశివారి జాతకం చూస్తే..
ఆదాయం 11 , వ్యయం 05 , రాజపూజ్యం 02 , అవమానం 04 గా ఉంది. జన్మరాశిలో రాహు గ్రహ సంచారం, ద్వితీయ, తృతీయాలలో గురు గ్రహ సంచారం, సప్తమ వ్యయంలో కేతు, శని గ్రహ సంచారం ప్రధాన ఫలితాలు నిర్ణయిస్తున్నాయి. వ్యాపారంలో చేసే మార్పులు ఆలోచించి చేయడం మంచిది. జీవిత భాగస్వామి నిర్ణయాలు తీసుకుని చేయ డం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగ వ్యాపారాలను బాధ్యతలు అధికమవుతాయి. సమాజంలోని కొంత మంది చేసిన రాజకీయాల వలన అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కొన్నాళ్ళు వృత్తి లో అసంతృప్తి ఏర్పడుతుంది. దైవ దర్శనాలు, దైవ కార్యక్రమాలకు ముందుంటారు. ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొనడం, గురువుల బోధనలు, ఆ ధ్యాత్మిక వాతావరణంలో గడపడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు.
కుంభ రాశి వారి జాతకం చూస్తే..
ఆదాయం 14 , వ్యయం 14 , రాజపూజ్యం 06 , అవమానం 01 గా ఉంది. ఈ సంవత్సరం తృతీయ చతుర్ధ రాశులలో గురు గ్రహ సంచారం జన్మరాశిలో శని గ్రహ సంచారం. గురు, శుక్ర మౌఢ్యయాలు, ద్వితీయ, తృతీయాలలో రాహుకేతు గ్రహ సంచారం ప్రధాన ఫలితాలు నిర్ణయించుతున్నాయి. ఈ సంవత్సరం ఈ రాశివారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. కొత్త సంపాదనా మార్గాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాహుకేతు సంచారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా వివాహ విషయంలో అన్ని విషయ వ్యవహారాలు పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం మంచిది. ఒకటికి నాలుగు సార్లు పరిశీలించుకుని, ఇరువురి జాతకం, నక్షత్ర పొంతన సరిచూసుకుని వివాహ పరంగా నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం.
Read Also :
Related News
Pawan Kalyan : పిఠాపురం నుంచే విజయకేతనం – పవన్ కళ్యాణ్
'క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. పిఠాపురం నుంచే విజయకేతనం ఎగురవేయబోతున్నాం. కొత్త ఏడాది ప్రజలకు మేలు చేయాలి. మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలి