Tulsi: తులసి మొక్కను ఇలా పూజిస్తే చాలు.. లక్ష్మీ అనుగ్రహం కలగడం ఖాయం!
తులసి మొక్కను ఇప్పుడు చెప్పబోయే విధంగా పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని చెబుతున్నారు పండితులు. అందుకోసం తులసి దేవిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
- By Anshu Published Date - 12:30 PM, Sat - 17 May 25

హిందువులు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటారు. దేవతగా భావించి తరచుగా పూజలు చేస్తూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరు హిందువుల ఇళ్ల వద్ద తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. తులసి మొక్కలు విష్ణువు లక్ష్మీదేవి ఇద్దరు కొలువై ఉంటారని భక్తుల నమ్మకం. తులసి మొక్కను పూజించే విషయంలో నీరు పోసే విషయంలో ఆకులను తుంచే విషయంలో ఎన్నో రకాల నియమాలు కూడా ఉన్నాయి. తులసి మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని, సానుకూల శక్తి వస్తుందని నమ్ముతారు.
తులసి మొక్కను బాగా పూజించేవారికి తులసీదేవి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్మకం. అయితే ఇంతకీ మరి తులసి మొక్కను ఎలా పూజిస్తే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే తులసి ఆకుల పరిహారం చేయడం మంచిది. ఇది డబ్బు సమస్యలను పరిష్కరిస్తుందట. దాంతో ధనవంతులు అవుతారని చెబుతున్నారు. అలాగే తులసి ఆకుల్ని పర్సులో పెడితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అప్పుల నుంచి కూడా బయటపడవచ్చట. ఇలా చేయడం వల్ల ధన లాభం కలుగుతుందట.
కాగా ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నట్లయితే తులసి చెట్టు ఆకులను ఎర్రటి గుడ్డలో చుట్టి పర్సులో పెట్టాలట. ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి, సంతోషంగా ఉండవచ్చు అని చెబుతున్నారు. ప్రతిరోజూ తులసి మొక్కకు నీళ్లు పోసి పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయట. అలాగే తులసి పరిహారం చేసేటప్పుడు ఎవరికీ చెప్పకండి, నిశ్శబ్దంగా చేయాలట. ఇలా చేస్తే మంచి ఫలితం వస్తుందట. వీటిని పాటించడంతో పాటు తులసి దేవికి ఇష్టం లేని కొన్ని రకాల పనులు కూడా చేయకూడదట. అవి ఏమిటంటే అమావాస్య ఏకాదశి సమయాల్లో తులసి దేవికి నీరు సమర్పించకూడదట.. అలాగే బుధవారం ఆదివారం రోజుల్లో కూడా వీటిని సమర్పించకూడదని ఎందుకంటే ఈరోజుల్లో తులసీదేవి విష్ణువు కోసం ఉపవాసం ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ నీటిని సమర్పిస్తే ఆ ఉపవాసానికి భంగం కలిగించినట్టు అవుతుందట.