TTD : నేడు వర్చువల్ ఆర్జిత సేవా టికెట్లు విడుదల..!!
- Author : hashtagu
Date : 16-11-2022 - 5:51 IST
Published By : Hashtagu Telugu Desk
డిసెంబర్ నెలకు సంబంధించి టీటీడీ ఆర్జితసేవా టికెట్ల కోటాను ఇవాళ విడుదల చేయనుంది. ఉదయం పదిగంటలకు tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ కోటా విడుదల చేయనున్నారు. ఇందులో శ్రీవారిలో ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ,సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించి వర్చువల్ సేవ, సంబంధిత టికెట్లు ఉండనున్నాయి. డిసెంబర్ నెలకుగాను రూ. 300దర్శన కోటాను టీటీడీ శుక్రవారం ఆన్ లైన్ ద్వారా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దర్శనకోటా విడుదలైన 80 నిమిషాల్లోనే భారీగా టికెట్లు బుక్ చేసుకున్నారు భక్తులు.
అయితే ఈ టికెట్లను అక్టోబర్ లోనే విడుదల చేయాల్సి ఉండగా, వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని డిసెంబర్ నుంచి మార్పు చేయాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో స్లాట్ల సర్దుబాటులో భాగంగా కొంత జాప్యం అయ్యింది.