Thrusday: పొరపాటున కూడా గురువారం రోజు అలాంటి పనులు అస్సలు చేయకండి?
మామూలుగా కొన్ని కొన్ని రోజుల్లో కొన్ని పనులు అస్సలు చేయకూడదని చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో గురువారం కూడా ఒకటి. గురువారం బృహస్పతికి అంకితం చే
- By Anshu Published Date - 07:30 PM, Wed - 6 December 23

మామూలుగా కొన్ని కొన్ని రోజుల్లో కొన్ని పనులు అస్సలు చేయకూడదని చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో గురువారం కూడా ఒకటి. గురువారం బృహస్పతికి అంకితం చేసిన రోజు. కాబట్టి ఆరోజు తెలిసి తెలియకుండా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు. మరి గురువారం రోజు ఎలాంటి తప్పులు చేయకూదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గురువారం రోజు చేయకూడని వాటిలో ఇల్లు శుభ్రం చేయడం కూడా ఒకటి. దుమ్ము దులపడం బూజు కొట్టడం లాంటి పనులు అస్సలు చేయకూడదు. మహిళలు గురువారం రోజు తల స్నానం అసలు చేయకూడదు. ఎందుకంటే గురువారం బృహస్పతి కి అంకితం చేయబడింది.
అలాగే భర్త యొక్క ప్రతిబింబాన్ని కూడా ప్రతిబింబిస్తాడని నమ్ముతారు. అందువల్ల , గురువారం తలను కడుక్కోవడం వలన భార్య పిల్లలకు దుదరుష్టం కలుగుతుందని,సంపదను కొల్పోయే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే గురువారం రోజు పురుషులు జుట్టు కత్తి రించుకోవడం గడ్డం తీసుకోవడం గోర్లు కత్తిరించుకోవడం లాంటివి చేయకూడదు. ఇలాంటి పనులుచేయడం వలన జీవితానికి లేదా పనికి ముప్పును ఆహ్వానిస్తుంది. అలాగే లక్ష్మి దేవి సిరి సంపదలకు,శ్రేయస్సుకు దేవత. విష్టువుకు లక్ష్మిదేవి భార్య. గురువారం లక్ష్మి దేవిని మాత్రమే పూజించడం అవమానకరమని భావిస్తారు. కాబట్టి లక్ష్మీదేవిని పూజించేటప్పుడు విష్ణువును కూడా కలిపి పోషించాలి.
అలాగే వివాహిత జీవితంలో ప్రేమను సామరస్యాన్ని కాపాడుకోవడానికి మీరు లక్ష్మిదేవితో పాటుగా విష్టు దేవుడుని కూడా పూజించడం చాలా ముఖ్యం. గురువారం రోజు పదనైనా వస్తువులను కొనుగోలు చేయడం అస్సలు మంచిది కాదు. అద్ధాలు, ఐలైనర్లు, కత్తులు,కత్తెరలు మొదలగు వస్తువులను కొనుగోలు చేయడం వలన చెడు ఫలితాలను కలిగిస్తుందది. అలాగే గురువారం రోజు ఉపవాసం ఉండటం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే పక్షులకు మూగ జంతువులకు ఆహారాన్ని పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది..