Superstition : చనిపోయిన పూర్వీకులు మీ కల్లోకి వస్తున్నారా, అయితే జరిగేది ఇదే..!!
ఒక్కో సారి ఇంటి పెద్దలు మన కలలో కనిపిస్తారు. అయితే, కొన్నిసార్లు అది వారి పట్ల మనకున్న ప్రేమ కావచ్చు.
- Author : hashtagu
Date : 15-09-2022 - 8:00 IST
Published By : Hashtagu Telugu Desk
ఒక్కో సారి ఇంటి పెద్దలు మన కలలో కనిపిస్తారు. అయితే, కొన్నిసార్లు అది వారి పట్ల మనకున్న ప్రేమ కావచ్చు. కొన్నిసార్లు వారు కలలోకి రావడం మనకు కొన్ని సూచనలను ఇస్తుంది. కలల ప్రపంచానికి సంబంధించిన ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని స్వప్న శాస్త్రంలో పేర్కొన్నారు. ప్రతి కలకు అర్థం సప్న శాస్త్రంలో ఉంది. కాబట్టి కలలో చనిపోయిన పెద్దలను చూడటం అంటే ఏమిటో తెలుసుకుందాం.
స్వప్న శాస్త్రం ప్రకారం చనిపోయిన మీ పూర్వీకులు లేదా పెద్దలు కలలో ఏడుస్తున్నట్లు కనిపిస్తే ఆయన ఏదో బాధలో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. వారి సంతృప్తి కోసం, మీరు వారికి శ్రాద్ధ కర్మలు సరిగ్గా చేయాలి. దీనితో పాటు, మీకు ఏదైనా చెడు జరగవచ్చని కూడా వారు సూచిస్తున్నారని అర్థం.
కలలో పెద్దలతో మాట్లాడటం
మీ కలలో మీ స్వర్గస్తులైన పెద్దలతో మాట్లాడటం సానుకూల కల. ఇటువంటి కలలు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. అలాంటి కలలు మీ జీవితంలో ఆనందం రాబోతుందని సూచిస్తున్నాయి. అలాంటి కలలు కుటుంబంలో కొంత పండుగ వాతావరణాన్ని కూడా సూచిస్తాయి.
చనిపోయిన పూర్వీకులను కలలో సంతోషంగా చూస్తే, మీకు దీర్ఘాయువు లభిస్తుందని అర్థం. అందువల్ల, అలాంటి కల వచ్చినప్పుడు భగవంతుడిని స్మరించండి.