Lakshmi Devi: లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే మీ ఇంట్లో ఇవి ఉండాల్సిందే!
లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే మన ఇంట్లో తప్పకుండా కొన్ని రకాల వస్తువులు ఉండాలని పండితులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 02:05 PM, Wed - 12 February 25

హిందూమతంలో లక్ష్మీదేవిని సంపదకు అది దేవతగా భావిస్తూ ఉంటారు. లక్ష్మీ అనుగ్రహం ఉంటే ఎలాంటి సమస్యలైనా అధిగమించవచ్చని, ఆర్థిక సమస్యలు ఉండవని నమ్ముతూ ఉంటారు. అలా కాకుండా అమ్మవారు ఆగ్రహిస్తే మాత్రం ఎలాంటి వారికైనా ఆర్థిక కష్టాలు తప్పవని చెబుతున్నారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు పరిహారాలు పాటించడంతో పాటు దానధర్మాలు చేయాలి. పశుపక్షాదులకు ఆహారాన్ని నైవేద్యంగా పెట్టాలి. పెద్దలు స్త్రీల పట్ల గౌరవంగా ఉండాలి.. పరిశుభ్రతను పాటించాలి.
వీటన్నిటితో పాటుగా ఇంట్లో కొన్ని రకాల వస్తువులు ఉండాలని చెబుతున్నారు. అక్షయ తృతీయ నాడు కొన్ని వస్తువులను మీ ఇంట్లో ఉంచుకోవడం ఉత్తమంగా చెపుతారు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ విధంగా జ్యువలరీ షాపుల్లో బంగారం కొనేందుకు చాలా మంది ఎగబడుతున్నారు. చాలా మంది తమ శక్తి మేర బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే అక్షయ తృతీయ నాడు బంగారం మాత్రమే కాదు.. కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం ఉత్తమం అని చెబుతున్నారు. ఇవి తీసుకుంటే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందట. ఇంట్లో సిరులు కురిపిస్తుందట.
అక్షయ తృతీయ రోజున మీ ఇంట్లో శ్రీయంత్రం కొంటే జీవితంలో ఐశ్వర్యానికి లోటు ఉండదట. దీన్ని ఇంట్లో ఉంచి సక్రమంగా పూజించాలని చెబుతున్నారు. ముందుగా గంగా నదిని నీటితో యంత్రాన్ని శుద్ధి చేసి ఆ తర్వాత పూజ చేసేటప్పుడు శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలట. ఈ విధంగా చేస్తే లక్ష్మి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందట. దీనితో పాటు కుబేర యంత్రాన్ని కూడా అక్షయ తృతీయ నాడు కొనుగోలు చేస్తే శుభ ప్రదంగా అని చెబుతున్నారు. పౌర్ణమి, ధంతేరస్, దీపావళి నాడు దీనిని పూజిస్తే ధనానికి లోటుండదట. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం లాభదాయకమని చెబుతారు. బంగారం కొనలేని వారు వెండి నాణేన్ని కొని ఎర్రటి గుడ్డలో గుడ్డలో చుట్టి మీ ఇంట్లోని బీరువాలో పెట్టుకున్నా మీకు ధనానికి లోటుండదని చెపుతున్నారు.