Lucky Marks: శ్రీకృష్ణునిలా మీ శరీరంపైనా ఈ గుర్తులు ఉంటే.. మీరే భాగ్యశాలి!!
హిందూ మతంలో ముక్కోటి దేవతలున్నారు అంటారు. వారిలో అత్యంత ముఖ్యమైన దేవుళ్లలో, అత్యంత ప్రసిద్ధి గాంచిన దేవుడైన కృష్ణుడి గురించి మనలో అనేక మందికి తెలుసు.
- By Hashtag U Published Date - 02:05 PM, Sat - 20 August 22
హిందూ మతంలో ముక్కోటి దేవతలున్నారు అంటారు. వారిలో అత్యంత ముఖ్యమైన దేవుళ్లలో, అత్యంత ప్రసిద్ధి గాంచిన దేవుడైన కృష్ణుడి గురించి మనలో అనేక మందికి తెలుసు. అయినప్పటికీ, శ్రీకృష్ణుని జీవితం మర్మంతో కూడుకున్నది. ఎంత తెలుసుకున్నా, ఇంకా మిగిలే ఉంటుంది. ఆసక్తిని రేకెత్తించే కథలతో నిండిపోయి ఉన్న శ్రీకృష్ణుని గురించిన, పూర్తి వివరాలను తెలుసుకోవాలని భక్తులు ఆకాంక్షిస్తుంటారు.
కొందరైతే కృష్ణుని గురించి తెలుసుకోవడం, విశ్వం గురించి తెలుసుకోవడం ఒకటే అని భావిస్తుంటారు కూడా. క్రమంగా ఈ విశ్వాoతరాళమంతా కృష్ణమయమని చెప్పబడింది. మహాభారతంలో శ్రీకృష్ణుడు..” నేనే గతము, నేనే ప్రస్తుతం, నేనే భవిష్యత్తు,నేనే దేవుని, నేనే సృష్టిస్తాను, నేనే నాశనం చేస్తాను, ఈ విశ్వంలో ప్రతి అణువులోనూ నేనుంటాను, ప్రతి విషయమూ నా కనుసన్నలలోనే ఉంటుంది” అని చెప్పాడు. అంత గొప్ప శక్తి సంపన్నుడు శ్రీ కృష్ణుడు. అటువంటి శ్రీ కృష్ణ పరమాత్ముని గురించి తక్కువగా తెలిసిన విషయాలను మీముందు ఉంచబోతున్నాము.
శ్రీకృష్ణ భగవానుడి శరీరం పై పుట్టుకతోనే కొన్ని గుర్తులు ఉండేవని అంటారు. ఆ గుర్తులను శుభ సూచకాలుగా భావిస్తుంటారు. ఆ గుర్తుల్లో కనీసం ఒక్కటైనా ఎవరి శరీరం పైన ఉంటే వారికి శుభాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఆ గుర్తులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
అర్ధ చంద్రాకారం..
శ్రీ కృషుని అరికాలు మీద అర్ధ చంద్రాకారం గుర్తు ఉండేదని చెబుతుంటారు. ఇదే గుర్తు శంకరుడి తలపై కూడా ఉంటుంది. ఎవరి శరీరం పైనైతే ఈ గుర్తు ఉంటుందో.. వారికి కెరీర్ లో అత్యున్నత స్థానాలు దక్కుతాయి. విజయాలు వారిని వరిస్తాయి.
శంఖం ఆకారం..
శ్రీ కృష్ణుని అరికాలు పై శంఖం ఆకారం కూడా ఉండేదని అంటారు. విష్ణుమూర్తి చేతిలో కూడా శంఖం ఉంటుంది. శంఖం ధ్వని ఎంత శక్తివంతమైనది అంటే.. దానివల్ల అంతరాత్మ మేలుకొలుపు, ఆత్మ చైతన్యం రెండూ కలుగుతాయి. ఈ గుర్తు ఎవరి శరీరం పైనేతే ఉంటుందో.. వారికి జీవితంలో విజయాలు సిద్ధిస్తాయి. సుఖ శాంతులతో జీవితం లభిస్తుంది.
మత్స్య ఆకారం..
శ్రీకృష్ణుని అర చేతిపై మత్స్య ఆకారం ఉంటుందని చెబుతారు. విష్ణుమూర్తి మత్స్య అవతారానికి పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఈ గుర్తు శరీరం పై ఉన్నవారికి సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. అంతటా మంచి ప్రాధాన్యం దక్కుతుంది.
ఇతర గుర్తులు..
త్రిభుజం ఆకారం, బాణం విల్లు ఆకారం, చేతిపై మచ్చ, చేతి సంకలో మచ్చ ఉన్నవారికి కూడా జీవితంలో ఎంతో సాఫల్యం దక్కుతుందని అంటారు. ఈ గుర్తుల్లో ఏదో ఒకటి శరీరం పై ఉన్నవారి దాంపత్య జీవితం ఎంతో సాఫీగా ఉంటుందని చెబుతారు. వీరికి ధన భాగ్యం కూడా ఎక్కువేనట!
Related News
Astro Tips: దురదృష్టం వెంటాడుతోందా.. అయితే ఈ పనులు చేస్తే చాలు లక్ష్మీ మీ వెంటే?
జ్యోతిష్య శాస్త్రంలో కష్టాల నుంచి గట్టెక్కడానికి, ఆర్థిక పరిస్థితులను దూరం చేసుకోవడానికి, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం,