Tulasi Mala : తులసి మాల ధరించడం వల్ల ఈ 5 లాభాలు..!
- By hashtagu Published Date - 06:23 AM, Tue - 1 November 22

తులసి.. విష్ణువుకు చాలా ప్రీతికరమైనది. భోగాన్ని సమర్పించేటప్పుడు లేదా దేవుడికి నీరు సమర్పించేటప్పుడు తులసి ఆకును వాటిలో ఉంచుతారు. కలుషిత నీటిలో కొన్ని తాజా తులసి ఆకులను వేసినట్లయితే ఆ నీరు శుద్ధి అవుతాయి. తులసి ఆకును రాగి పాత్రలో ఉంచినట్లయితే.. నీటిని శుద్ధి చేస్తాయి. ఎందుకంటే రాగికి, తులసికి నీటిని శుద్దిచేసే గుణం ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 3-5 తులసి ఆకులను తింటే ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుందని నమ్ముతారు. తులసిలో శ్యామ్ తులసి, రామ తులసి అని రెండు రకాలు ఉన్నాయి. తులసి మాల వేసుకోవడం వల్ల కలిగే లాభాలు తెలుసా? తెలుసుకుందాం.
భక్తిని పెంచుతుంది:
శ్యామ తులసి మాల ధరించడం వల్ల మానసిక ప్రశాంతత, భగవంతుని పట్ల భక్తి పెరుగుతుంది. మనసులో సానుకూల భావోద్వేగాలు, ఆధ్యాత్మిక పురోభివృద్ధితోపాటు కుటుంబ, భౌతిక పురోభివృద్ధి కలుగుతాయి.
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది:
రామ తులసి జపమాల ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిలో సాత్విక భావాలు మేల్కొల్పుతాయి. ఇది మీ విధులను నిర్వహించడానికి ఎంతగానో సహాయపడుతుంది.
ఆరోగ్య సమస్యలు:
తులసి మాలకు ఎంతో శక్తి ఉంటుంది. జ్వరం, జలుబు, తలనొప్పి, చర్మవ్యాధులతో బాధపడేవారు కూడా తులసి మాల ధరించడం వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఎలాంటి అంటువ్యాధులు, అకాల మరణం ఎదురుకాదని శాస్త్రాలు చెబుతున్నాయి.
జీర్ణశక్తిని పెంచుతుంది:
తులసి మాల ధరించడం వలన వ్యక్తి జీర్ణ శక్తి పెరుగుతుంది. అధిక జ్వరం, మెదడు వ్యాధులు, గాలికి సంబంధించిన అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.
కీర్తి, గౌరవం లభిస్తాయి:
తులసి మాల ధరించడం వలన కీర్తి, గౌరవం, సంపదలు పెరుగుతాయి. తులసి ఆకులను తింటే రోగాలు, బాధల నుంచి విముక్తి లభిస్తుంది.