HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Devotional
  • >There Are 108 Types Of Aarti Do You Know The Result Of Any Aarti

108 Aartis : ఏ హారతితో మనకు ఏ ఫలితం సిద్ధిస్తుంది ?

108 Aartis : సర్వేశ్వరునికి వేదమంత్రోక్తంగా, సశాస్త్రీయంగా ఇచ్చే సర్వమంగళ నీరాజనమే హారతులు.

  • By Pasha Published Date - 03:37 PM, Fri - 3 November 23
  • daily-hunt
108 Aartis
108 Aartis

108 Aartis : సర్వేశ్వరునికి వేదమంత్రోక్తంగా, సశాస్త్రీయంగా ఇచ్చే సర్వమంగళ నీరాజనమే హారతులు. జీవుడిని పరమాత్మవైపు నడిపించే కాగడానే హారతి. ఇవి 108 రకాలని ఋగ్వేదం చెబుతోంది. ఏక హారతి మొదలుకొని 108 జ్యోతుల వరకూ హారతులను లెక్కిస్తారు. 108 జ్యోతులతో చేసేదాన్ని అష్టోత్తర హారతి అని పిలుస్తారు. జ్యోతుల సంఖ్య పెరిగేకొద్దీ వాటికి ప్రత్యేక మంత్రం ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

  • నదుల్లోని ఔషధ గుణాలు పెరగడానికి తోడ్పడే హారతి పేరు ఏక హారతి.
  • దృష్టిలోపాలు తొలగిపోయేందుకు దోహదం చేసే దాన్ని నేత్రహారతి అంటారు.
  • పాపాలను నశింపజేసి సకల శుభాలను కలుగజేసేది ఓంకార హారతి.
  • దీర్ఘాయువు,  సంతాన సౌభాగ్యం, రోగనివారణ కోసం ఇచ్చేది నాగహారతి.
  • భక్తుల పంచ మహాపాతకాలను నశింపజేసేది పంచహారతి.
  • మనసులో ఉన్న గందరగోళాలు తొలగిపోయేలా చేసేది కుంభహారతి.
  • మనిషిలో ఉన్న అసుర ప్రవృత్తిని తొలగించేది సింహ హారతి. శత్రువులను శిక్షించి, ధర్మాన్ని రక్షించే మహిమ దీని సొంతం.
  • నంది హారతి.. భక్తులకు నిర్మలమైన భక్తి సకల ధర్మాచరణ అనే ఫల ప్రాప్తిని అందిస్తుంది.
  • చంద్ర హారతి దర్శనం వల్ల భక్తుల్లో పరోపకార బుద్ధి, ధార్మికమైన మనస్సు, దానగుణం వృద్ధి చెందుతాయి.
  • నక్షత్ర హారతి దర్శనం వల్ల భక్తులకు అనంతమైన పుణ్యం (108 Aartis)  సిద్ధిస్తుంది.

Also Read: 7 Signs Of Fantasies : మీ భాగస్వామి మరొకరితో లైన్‌లో ఉన్నాడనడానికి 7 సిగ్నల్స్

దీపావళి రోజున..

నరక చతుర్దశి వేకువ జామున చంద్రోదయం అయిన తర్వాత ఒక గంట వరకు (సూర్యోదయానికి ముందు) దేవతలకూ, బ్రాహ్మణులకూ, పెద్దలకూ, తల్లికి, గోవులకు హారతులు ఇచ్చి వాళ్ల దీవెనలు పొందాలన్నది శాస్త్ర వచనం. తర్వాత అభ్యంగన స్నానం ఆచరించి దేవతారాధన చేయాలి. అన్నదమ్ములకు, అక్కాచెల్లెళ్లు తలపై నువ్వుల నూనె అంటి, నుదుట కుంకుమబొట్టు పెట్టి మంగళహారతి ఇస్తారు. తోబుట్టువుల మధ్య అనుబంధాలు పదికాలాలు పచ్చగా ఉండాలన్నది ఈ వేడుకలో అంతరార్థం. ప్రతిరోజూ మంగళప్రదంగా కొనసాగాలని ఆడపడుచుల నుంచి హారతులు అందుకొని, యథాశక్తి వారికి బహుమతులు సమర్పించడం సంప్రదాయంగా స్థిరపడింది.

గమనిక: ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 108 Aartis
  • 108 Types Of Aarti
  • Different Aartis
  • Result Of Aarti
  • spirituality

Related News

    Latest News

    • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd