Bangles: పెళ్లైన మహిళలు మట్టి గాజులను ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా?
ఫ్యాషన్ పేరుతో పెళ్లి తరువాత గాజులను వేసుకోవడం మర్చిపోయిన స్త్రీలు కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలని పండితులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 10:00 AM, Fri - 13 December 24

పెళ్లి అయినా అలాగే పెళ్లి కానీ ఆడవారు ధరించేటటువంటి ఆభరణాలలో గాజులు కూడా ఒకటి. కానీ ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ పేరుతో గాజులు వేసుకోవడమే మరిచిపోయారు. బ్రాస్లైట్, సైడు గాజులు, వాచ్ వంటివి మాత్రమే ధరిస్తున్నారు. ఒక్క పెళ్లి సమయంలో మాత్రమే చేతినిండా గాజులను ధరిస్తున్నారు. పెళ్లి అయిన స్త్రీలు కూడా ఈ విధంగానే ఫ్యాషన్ పేరుతో గాజులను వేసుకోవడమే మర్చిపోయారు. అయితే గాజులు కేవలం అందానికి మాత్రమే కాదండోయ్ సౌభాగ్యానికి చిహ్నం. ఈ గాజులు ఒక్కొక్క రంగు ఒక్క రకాల అర్థాలు తెలియజేస్తాయి అన్న విషయం చాలా మందికి తెలియదు.
మరి ఏ రంగు గాజులు ఎలాంటి అర్థాలు తెలియజేస్తాయి అన్న విషయానికి వస్తే.. ఎరుపు రంగు గాజులు శక్తిని, నీలం రంగు గాజులు విజ్ఞానాన్ని, ఉదా రంగు స్వేచ్ఛను, అలాగే ఆకుపచ్చ రంగు అదృష్టాన్ని, పసుపు రంగు సంతోషాన్ని, నారింజ రంగు విజయాన్ని, తెల్ల రంగు ప్రశాంతతను, నలుపు రంగు అధికారాన్ని తెలియజేస్తాయి. ఇలా ఒక్కోరంగు గాజు ఒక్కో అర్థాన్ని తెలియజేస్తుంది. మట్టి గాజులకు ఎంతో ప్రత్యేకత విశిష్టత ఉంది. అందుకే పెళ్లి అయ్యి సుమంగళీగా ఉన్న స్త్రీలు కేవలం మట్టి గాజులు మాత్రమే ధరించాలని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.
కానీ ఈ మధ్య కాలంలో మట్టి గాజులకు బదులుగా ఇతర ప్లాస్టిక్, మార్కెట్లో దొరికే రకరకాల గాజులను వినియోగిస్తున్నారు. ఒకవేళ మీరు బాగా డబ్బు ఉన్న వారు అని బంగారు గాజులు వేసుకున్నప్పటికీ ఒక్కొక్క చేతికి కనీసం రెండేసి మట్టి గాజులను ధరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి పూజలో కూడా పసుపు కుంకుమలతో పాటుగా గాజులను ఉంచి పూజించడం అన్నది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. అలాగే శుభకార్యాల సమయంలో పెళ్లిళ్ల సమయంలో ముత్తైదువులకు గాజులు ఇచ్చే ఆచార సంప్రదాయాలు ఎప్పటినుంచో ఉన్నాయి. కాబట్టి పెళ్లి అయిన స్త్రీలు ఇప్పుడు కూడా ఖాళీ చేతులతో ఉండకూడదు. చేతుల నిండా గాజులు వేసుకుని ఉండడం వల్ల అది ఆ స్త్రీ యొక్క సుమంగళిని తెలియజేస్తుంది.