Tulsi Plant: తులసి మొక్కతో ఇలా చేస్తే చాలు వాస్తు దోషాలు తొలగిపోవడం ఖాయం!
ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోయి ఆర్థిక సమస్యలు దూరం అవ్వాలంటే తులసి మొక్కతో కొన్ని రకాల పనులు చేయాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 02:03 PM, Fri - 20 December 24

హిందువులు తులసి మొక్కను పరమపవిత్రంగా భావించడంతో పాటు పూజలు కూడా చేస్తూ ఉంటారు. తులసి మొక్కను పూజించడం వల్ల తులసి దేవి అనుగ్రహంతో పాటు శ్రీమహావిష్ణువు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని నమ్ముతారు. హిందువుల ప్రతి ఒక్కరి ఇళ్లలో తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. తులసి మొక్కకు ప్రతిరోజు పూజ చేయడం వల్ల ఇంట్లోకి ఎలాంటి నెగటివ్ ఎనర్జీలు రాకుండా అడ్డుకుంటుందని నమ్ముతారు. అయితే అలాంటి తులసి మొక్కతో వాస్తు దోషాలను తొలగించుకోవచ్చు అని చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తులసి మొక్కను ఎప్పుడూ కూడా ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా ఇంటికి ఎదురుగా ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఈ విధంగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద తులసి కోటను కట్టుకోవడం వల్ల వాస్తు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయట. ఫలితంగా ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుందని చెబుతున్నారు పండితులు. అలాగే తులసి వేరును వేలాడదీయడానికి ముందుగా తులసి వేరుని తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో బియ్యంతో కలిపి కట్టాలట.
ఆ తర్వాత ఆ చిన్నపాటి ముడుపును ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచితే అంతా మంచే జరుగుతుందని ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించేదని చెబుతున్నారు. తులసి మొక్క నాటిన ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఉండేదట. ఏ ఇంట అయితే తులసి మొక్క ఉంటుందో ఆ ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. తులసి మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా కొలువై ఉంటుందని అక్కడ నివాసం ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటికి ఎదురుగా ప్రధాన ద్వారం వద్ద తులసి మొక్కను ఏర్పాటు చేసుకుని క్రమం తప్పకుండా పూజలు చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుందట.