Dwaraka Sankaracharya: స్వామి స్వరూపానంద సరస్వతి అస్తమయం..!!
ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి శివైక్యం పొందారు.
- Author : hashtagu
Date : 11-09-2022 - 7:58 IST
Published By : Hashtagu Telugu Desk
ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి శివైక్యం పొందారు. ఈ మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 99 సంవత్సరాలు. మధ్యప్రదేశ్ లోని శ్రీధామ్ జ్యోతేశ్వర్ ఆశ్రమంలో ఆదివారాం మధ్యాహ్నం 3.30 గంటలకు కన్నుమూశారు. స్వామి స్వరూపానంద సరస్వతి దేశంలోని అత్యున్నత ఆధ్యాత్మిక పీఠాధిపతిగా పేరుపొందారు.
1300ఏళ్ల క్రితం ఆది శంకరాచార్యులు ఏర్పాటు చేసిన నాలుగు శక్తి పీఠాల్లో ద్వారకా, జ్యోతిర్మఠ్ శక్తి పీఠాలకు స్వామి స్వరూపానంద అధిపతిగా ఉన్నారు. ఇక స్వరూపానంద సరస్వతి మధ్యప్రదేశ్ లోని సియోనీ జిల్లా దిఘోరీ గ్రామంలో జన్మించారు. వేదవేదాంగాలను అభ్యసించిన ఆయన దేశంలోని ప్రముఖ పీఠాధిపతిగా ఎదిగారు. అయోద్యలో రామమందిర నిర్మాణం కోసం ఎంతో పోరాడారు.