HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Sri Rama Navami 2025 Date Time Puja Vidhi And Significance

Sri Rama Navami: శ్రీరామ నవమి పండుగ ఎప్పుడు.. ఆ రోజు ఏమి చేస్తే రాముడి అనుగ్రహం లభిస్తుందో మనందరికి తెలిసిందే?

ఈ ఏడాది శ్రీరామనవమి పండుగ ఎప్పుడు వచ్చింది.ఆ రోజున ఏం చేయాలి? ఏం చేస్తే శ్రీరాముడి అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 04-04-2025 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sri Rama Navami
Sri Rama Navami

హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలు శ్రీరామనవమి పండుగ కూడా ఒకటి. ఈ శ్రీరామనవమి పండుగను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. కొన్ని ఏ ప్రదేశాలలో కొన్ని రోజులపాటు ఈ శ్రీరామనవమి వేడుకలు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. శ్రీరాముడు చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిదవ రోజున జన్మించాడు. అందుకే ప్రతి సంవత్సరం చైత్ర మాసం తొమ్మిదవ రోజున శ్రీ రామ నవమి పండుగ జరుపుకుంటారు. కాగా చైత్ర మాసంలోని శుక్ల పక్ష నవమి తిథి ఏప్రిల్ 5 న సాయంత్రం 7:26 గంటలకు ప్రారంభమవుతుంది.

ఈ తిథి మరుసటి రోజు ఏప్రిల్ 6న సాయంత్రం 7:22 గంటలకు ముగుస్తుంది. హిందూ మతంలో ఉదయ తిథిని పరిగణలోకి తీసుకుంటారు. కనుక ఉదయం తిథి ప్రకారం ఈసారి శ్రీ రామ నవమి 2025 ఏప్రిల్ 6న జరుపుకోనున్నారు. ఇకపోతే ఈరోజు పూజా విధానం విషయానికి వస్తే.. శ్రీ రామ నవమి రోజున ఉదయం నిద్రలేచి స్నానం చేయాలి. ఆ తరువాత శుభ్రమైన దుస్తులు ధరించాలి. తరువాత పూజా స్థలాన్ని శుభ్రం చేయాలి. ఒక స్టూల్ మీద ఒక గుడ్డను పరిచి, దానిపై రాముడి విగ్రహం లేదా చిత్ర పటాన్ని ఉంచాలి. గంగా జలం, పంచామృతం, పువ్వులు మొదలైనవి రాముడికి సమర్పించాలి.

దేవునికి పసుపు పండ్లు, చలిమిడి, పానకం, వడపప్పుని నైవేద్యంగా సమర్పించాలట. అలాగే రామచరిత మానస్ ను లేదా సుందరకాండ ను పారాయణం చేయాలట. చివరికి శ్రీ రామునికి హారతి ఇచ్చి పూజను ముగించాలట. దీని తరువాత పేదలకు, నిరుపేదలకు విరాళాలు ఇవ్వాలని చెబుతున్నారు. అయితే ఈ రామనవమి రోజున పూజ చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. ఈ రోజున పూజ చేయడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందట. దీనివల్ల ఇంట్లో సంపద పెరుగుతుందని, సీతా దేవి లక్ష్మీ దేవి స్వరూపం. అటువంటి పరిస్థితిలో రామనవమి రోజున శ్రీరాముడితో పాటు సీతాదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయట.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • lord rama
  • pooja
  • Sri Rama Navami
  • Sri Rama Navami 2025

Related News

Asbl Sriramanavami

Sriramanavami : ఏఎస్‌బిఎల్ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

ఈ మహోత్సవానికి సినీ, బుల్లితెర ప్రముఖుల తాకిడి విశేషంగా కనిపించింది. సుమ కనకాల, ఐశ్వర్య రాజేష్, లాస్య మంజునాథ్, శివ జ్యోతి, హిమజ, విష్ణుప్రియ, అలేఖ్య హారిక వంటి సెలబ్రిటీలు హాజరై వేడుకకు మరింత గ్లామర్‌ను అద్దారు

  • Srirama Navami Story

    Sri Rama Navami Special : శ్రీరామనవమి విశిష్టత.. ధర్మ సంస్థాపన కోసం ఉద్భవించిన రాముడు!

Latest News

  • మిడిల్ ఈస్ట్ యుద్ధం.. ఇరాన్‌పై పెరుగుతున్న‌ ఒత్తిడి?!

  • Pawan Kalyan: ఏపీ పంచాయతీరాజ్‌ శాఖకు 5 జాతీయ స్థాయిలో అవార్డులు..

  • చెప్పులు వాడుతున్నారా? అయితే ఈ న్యూస్ చ‌ద‌వాల్సిందే!

  • ఈ మహిళలు రాత్రి పూట పెరుగు తినకూడదు?

  • Urine Risks: మూత్రాన్ని బలవంతంగా ఆపుకుంటున్నారా? కలిగే నష్టాలు, సమస్యలు ఏంటో తెలుసుకోండి.

Trending News

    • ఐపీఎల్ 2026.. ప్లేఆఫ్స్‌కు చేరే జ‌ట్లు ఇవేనా?

    • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd