Viral Video: నాగ పంచమి.. పాలు తాగుతూ దర్శనం ఇచ్చిన పాము.. వైరల్ వీడియో!
నాగుల పంచమి పండుగ హిందువులకు అత్యంత ప్రాధాన్యమైన పండుగ అని చెప్పవచ్చు. ఈ నాగుల పంచమి రోజున
- By Nakshatra Published Date - 08:45 AM, Thu - 4 August 22

నాగుల పంచమి పండుగ హిందువులకు అత్యంత ప్రాధాన్యమైన పండుగ అని చెప్పవచ్చు. ఈ నాగుల పంచమి రోజున హిందువులు శివాలయాలకు అలాగే నాగుల కట్ట దగ్గరికి వెళ్లి పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఈ నాగుల పంచమి రోజున ఎక్కువగా శివలింగానికి పాలతో అభిషేకం చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఇలా నాగుల పంచమి రోజున శివుడికి పాలతో అభిషేకం చేస్తూ ఉండగా ఒక బారి పాము శివలింగాన్ని చుట్టుకుని కనిపించింది. శివలింగం నుంచి జారిన పాలను ఆ పాము తాగుతోంది. అయితే ఇక్కడ ఆశ్చర్య పోవాల్సిన విషయం ఏమిటంటే ఆ పాము భక్తులకు ఎటువంటి హాని చేయలేదు.
భక్తులు కూడా ఆ పాముకు ఎటువంటి హాని చేయకుండా నెమ్మదిగా శివుడికి అభిషేకం చేస్తూ పాముకి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎందుకు సంబంధించిన వీడియో ని షేర్ చేస్తూ ఈ నాగు పంచమి నాడు భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి అన్న క్యాప్షన్ ని కూడా జోడించారు. నాకు పంచమి రోజున ఇలాంటి దృశ్యం కనిపించడంతో భక్తులు అదృష్టంగా భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై కొందరు భక్తులు ఆనందం వ్యక్తం చేస్తుండగా మరియు కొందరు అభ్యంతరం చెబుతున్నారు.
పాముకి పాలు పోయకూడదు అది చనిపోతుంది అని కామెంట్ చేయగా.. కామెంట్ పై స్పందించిన మరొక నెటిజన్.. అక్కడ ఎవరూ పాముకి పాలు పోయడం లేదు శివలింగంపై పోసిన పాలను పాము తాగుతోంది. పాములు విషాన్ని కూడా తాగగలవు అటువంటిది పాలు పెద్ద సంగతి ఏం కాదు అంటూ కామెంట్స్ చేశాడు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Related News

Steel Glass In Stomach: వామ్మో అతని కడుపులో స్టీల్ గ్లాస్.. అసలు ఎలా వెళ్లిందంటే?
సాధారణంగా మనకు కొన్ని కొన్ని సార్లు కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. అయితే మరి కొన్నిసార్లు ఈ కడుపునొప్పి తీవ్రం