Dishti: దిష్టి తగిలిందా.. అయితే ఈ 4 వస్తువులతో ఇలా చేస్తే చాలు వెంటనే దిష్టి పోతుంది!
Dishti: దిష్టి తగిలింది అనుకున్న వారు దిష్టి పోవడం కోసం ఇప్పుడు చెప్పబోయే నాలుగు రకాల వస్తువులను ఉపయోగించి దిష్టి తీస్తే చాలు, వెంటనే దిష్టి పోవడం ఖాయం అని చెబుతున్నారు.
- Author : Anshu
Date : 09-12-2025 - 7:30 IST
Published By : Hashtagu Telugu Desk
Dishti: హిందూ సాంప్రదాయం ప్రకారం దిష్టిని తీవ్ర నష్టంగా పరిగణిస్తారు. ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా కూడా మంచిది కాదని నమ్ముతారు. వ్యక్తి ఎదుగుతుంటే సమాజంలో కొందరు చూసే అసూయ చూపులు అతడి జీవితాన్ని మార్చేస్తాయని పండితుల సైతం చెబుతున్నారు. కాగా ప్రస్తుతం మనం అటువంటి సమాజంలో ఉన్నామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే దిష్టి పోవడానికి చాలామంది ఎన్నెన్నో పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అయినా కూడా ఈ నరదిష్టి అనేది పోదు.
మరి అలాంటప్పుడు ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. కాగా దిష్టి అంటే అసూయతో కూడిన చూపు వల్ల కలిగే నెగటివ్ ఎనర్జీ. అంటే ఒకరు మన అందం, ఆరోగ్యం లేదా సౌకర్యాన్ని, మన ఎదుగుదలను చూసినప్పుడు వారి మనసులో కలిగే అసూయ మనపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పండితులు చెబుతుంటారు. కను దిష్టి తగలడం వల్ల ఆరోగ్యం క్షీణించడం, మనశ్శాంతి లోపించడం లేదా ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు కలగడం వంటివి జరగవచ్చట. ఈ దిష్టిని తొలగించడానికి కొన్ని రకాల వస్తువులు ఉపయోగపడతాయట. అందులో కర్పూరం, గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయ ముఖ్యమైనవి. వీటికి ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తులు ఉంటాయట. అవి నెగటివ్ ఎనర్జీని గ్రహించి దిష్టిని తొలగిస్తాయట.
కర్పూరంలో స్వచ్ఛమైన అగ్ని శక్తి ఉంటుంది. దాన్ని వెలిగిస్తే చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ నశిస్తుందని నమ్మకం. గుమ్మడికాయ పవిత్రతకు, ఆపద నివారణకు చిహ్నంగా భావిస్తారు. కొబ్బరికాయ కొట్టడం దేవుడికి మనల్ని మనం సమర్పించుకోవడానికి గుర్తుగా భావించాలట. నిమ్మకాయ దిష్టిని గ్రహించి మన శక్తి క్షేత్రాన్ని శుభ్రపరుస్తుందట. దిష్టి తొలగించే వస్తువులతో పాటు తీసే పద్ధతి కూడా ముఖ్యమే. సాధారణంగా చాలామంది ఏం చేస్తారంటే చేతిలో కొద్దిగా ఉప్పు తీసుకొని, తమ చుట్టూ మూడుసార్లు తిప్పుకొని, ఆ ఉప్పును నీటిలో కరిగిస్తుంటారు. మరికొందరు కర్పూరం, నిమ్మకాయ, కొబ్బరికాయ, గుమ్మడికాయ లను తమ చుట్టూ 5 సార్లు తిప్పుకొని రోడ్డు పక్కన పగలగొట్టే పద్ధతిని పాటిస్తారు. ఇలా చేస్తే తగిలిన నెగటివ్ ఎనర్జీ పోతుందని నమ్మకం. అంతేకాదు ఈ వస్తువులను ఇంట్లో సరైన ప్రదేశంలో ఉంచడం, శుభ్రంగా, శ్రద్ధగా పరిరక్షించడం ద్వారా ప్రతికూల శక్తులను నివారించవచ్చని నమ్మకం. ఇవి మానసికంగా కూడా ఒక రకమైన ఆత్మీయ భద్రతను కల్పిస్తాయట. దిష్టి తీయడానికి ఆదివారం, అమావాస్య అనువైన రోజులు. ఆ రోజుల్లో శారీరక, మానసిక శక్తి సమతుల్యంగా ఉంటుంది కాబట్టి, ఆ రోజు దిష్టి తీస్తే ఫలితం త్వరగా వస్తుందని నమ్మకం.