HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Significance Subramania Shashti

Spirituality: పిల్లలు లేని వారు సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు పూజిస్తారో తెలుసా?

సుబ్రహ్మణ్యస్వామి పూజించడం వల్ల సంతానం కలుగుతుందా లేదా అన్న విషయాల గురించి తెలిపారు.

  • Author : Anshu Date : 16-09-2024 - 4:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Spirituality
Spirituality

ప్రస్తుత రోజుల్లో చాలామంది దంపతులు పెళ్లి అయ్యి కొన్ని ఏళ్లు అవుతున్నా కూడా పిల్లలు కలగడం లేదని బాధపడడంతో పాటు హాస్పిటల్స్ చుట్టూ గుళ్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పిల్లలు కలగడం లేదని వాపోతూ ఉంటారు. అలాంటప్పుడు రకరకాల యోగాలు, దానధర్మాలు పరిహారాలు చేయడంతో పాటు కొంతమంది దేవుళ్ళను కొలవమని చెబుతూ ఉంటారు. అందులో సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం కూడా ఒకటి. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారు అని చాలామంది అంటూ ఉంటారు. మరి ఈ విషయంలో నిజానిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సుబ్రహ్మణ్యస్వామి నీ కుమారస్వామి అని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. అలాగే ఒక్కో ప్రదేశంలో ఒక్కొక్క అవతారంలో కూడా సుబ్రహ్మణ్యస్వామి దర్శనమిస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామి పూజించడం వల్ల సర్ప దోషం తొలగిపోయి సంతానం కలుగుతుందని చెబుతుంటారు. అందుకే చాలా వరకు సుబ్రహ్మణ్యస్వామి ఆలయాల్లో మహిళలు అలాగే దంపతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. దీని వెనుక పురాణాల ప్రకారం ఒక కథ కూడా ఉంది. సుబ్రమణ్య స్వామి అష్టకం ఒక రోజు పార్వతి, పరమేశ్వరులను దర్శించడానికి అనేక మంది తాపసులు కైలసానికి వస్తారు. అందులో దిగంబర ఋషులు ఉండటంతో సుబ్రమణ్యస్వామి హేళనగా నవ్వాడు.

దానికి పార్వతిదేవి పుత్రుని మందలించి, మర్మాంగాలు సృష్టి వృద్ధి కోసం సృష్ణ్తిచినవి, జాతికి జన్మస్థానాలు అని తెలియచెప్పింది. తల్లి జ్ఞాన భోధతో సుబ్రమణ్య స్వామి సర్పరూపం దాల్చాడు కొంతకాలం. జీవకణాలు పాముల్లా ఉంటాయని మనకు తెల్సిందే. ఆ తర్వాత వాటికి అధిపతి అయాడు. అందువల్లే జీవకణాల అధిపతి అయిన సుబ్రమణ్య స్వామిని పూజిస్తే పిల్లలు పుట్టని దంపతులకు సంతానం కలుగుతుంది చాలా మంది నమ్మకం. సుబ్రహ్మణ్యస్వామి జన్మించిన రోజున ఉపవాస దీక్షను చేపట్టి అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామిని ఆరాధిస్తారు. ఆలయానికి వెళ్లి స్వామివారికి పూజాభిషేకాలు జరిపిస్తారు. పుట్టలో పాలుపోసి బెల్లం అరటిపండ్లు నైవేద్యంగా సమర్పింస్తుంటారు. సంతానం కోసం సుబ్రహ్మణ్యషష్టి రోజున సుబ్రహ్మణ్యస్వామిని తప్పకుండా స్తుతించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

note: పైన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. వాటిని పాటించాలా వద్దా అన్నది మీ వ్యక్తిగతం మాత్రమే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • childrens
  • pooja
  • spirituality
  • subramanya swamy
  • womens

Related News

Amavasya December 2025

ఈ ఏడాది చివరి అమావాస్య.. ఏ రోజు వచ్చిందో తెలుసా ప్రాముఖ్యత ఇదే

అమావాస్య అంటే చంద్రుడు కనబడకుండా ఉండే రోజు. ఈ అమావాస్యను పితృ దేవతలను పూజించడానికి, దానధర్మాలు చేయడానికి అనువైన రోజుగా భావిస్తారు. అమావాస్య రోజున పూర్వీకులను తలచుకుని పిండ ప్రధానం చేయడం వల్ల వారికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈరోజున చేసే దానధర్మాలు కోర్కెలను నెరవేరుస్తాయని, ఆధ్మాత్మిక శక్తిని పెంపొందిస్తాయని కూడా నమ్మకం. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ నెల అమావాస్య ఎప్పుడ

    Latest News

    • 2026 రిలేషన్‌షిప్ టిప్స్.. భాగస్వామి జీవితాన్ని మార్చే నిర్ణ‌యాలీవే!

    • బుర్జ్ ఖలీఫా రికార్డు గల్లంతు.. త్వరలో ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా జెడ్డా టవర్!

    • వీబీ- జీ రామ్ జీ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం.. ఉపాధి హామీ ఇకపై 125 రోజులు!

    • బ్రేకింగ్‌.. భార‌త్‌పై పాక్ ఘ‌న‌విజ‌యం!

    • 2026లో జరగబోయే 10 ప్రధాన క్రీడా టోర్నమెంట్లు ఇవే!

    Trending News

      • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

      • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

      • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

      • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

      • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd