Hanuman: పంచముఖ ఆంజనేయ స్వామిని ఈ విధంగా పూజిస్తే చాలు.. సమస్యలన్నీ మటుమాయం!
పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల అనేక ఫలితాలను పొందవచ్చని చెబుతున్నారు.
- By Anshu Published Date - 06:00 PM, Tue - 13 August 24

హిందువులు ఎక్కువగా కొలిచే దేవుళ్లలో ఆంజనేయ స్వామి కూడా ఒకరు. గ్రామాలలో ప్రతి ఒక్క ఊరిలో తప్పనిసరిగా ఆంజనేయస్వామి గుడి ఉంటుంది. హనుమంతుడు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క అవతారంలో దర్శనమిస్తూ ఉంటాడు. కేవలం ఆంజనేయ స్వామి గుడిలో మాత్రమే కాకుండా రామాలయంలో కూడా ఆంజనేయ స్వామి విగ్రహం తప్పకుండా ఉంటుంది. అయితే ఆంజనేయ స్వామి ఆలయాలు చాలా ఉన్న అందులో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయని చెప్పాలి.
ఒక్కో ముఖం ఒక్కోలా ఉంటుంది. ఐదు ముఖాలలో మొదటి ముఖం కోతి, రెండవ ముఖం డేగ, మూడవ ముఖం వరాహ, నాల్గవ ముఖం నరసింహ, ఐదవ ముఖం గుర్రం. అయితే ఈ పంచముఖ ఆంజనేయ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు పండితులు. మరి పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆంజనేయుడి మొదటి వానర రూపం మనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్న శత్రువులను జయించడంలో సహాయపడుతుంది.
మనల్ని ఇబ్బంది పెట్టే చిన్నా పెద్దా కష్టాలను దూరం చేసేందుకు గరుడుడి రెండో ముఖం మనల్ని కనుమరుగు చేస్తుంది. జీవితంలో కీర్తి, బలం, ధైర్యం , ఆయురారోగ్యాలు పొందాలంటే మూడవ ముఖమైన వరాహుడిని పూజించాలి. భయం, నిరాశ, ఒత్తిడి , ప్రతికూల శక్తుల నుండి దూరంగా ఉండాలంటే నరసింహ రూపాన్ని పూజించాలి. మన జీవితంలోని కోరికలన్నీ తీరాలంటే అశ్వ ముఖాన్ని పూజించాలి. దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి మంగళవారం రోజు వెళ్లి ఆ పంచముఖ ఆంజనేయస్వామి భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల అనేక సత్ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. తనను భక్తితో పూజించినవారు కోరిన కోర్కెలు తీర్చే ఆంజనేయస్వామికి ఐదు అంటే అమితమైన ఇష్టం. అందుకనే హనుమంతుడి గుడి చుట్టూ ఐదు ప్రదక్షణలు, ఐదు అరటిపళ్ళు సమర్పించాలని పండితులు చెబుతారు. అయితే మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు, ఆయురారోగ్యాలు ఇస్తాడు .