Lord Shani: శనివారం రోజు ఈ ఐదు పనులు చేస్తే చాలు శని అనుగ్రహం కలగడం ఖాయం!
శనీశ్వరుడి అనుగ్రహం కలగాలి అనుకున్న వారు శనివారం రోజు తప్పకుండా ఐదు రకాల పనులు చేయాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 02:00 PM, Tue - 1 October 24

హిందూమతంలో ఒక్కొక్క రోజు ఒక్కొక దేవుడికి అంకితం చేయబడింది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అలా శనివారం రోజు శనీశ్వరుడికి అంకితం చేయబడింది. శనివారం రోజున శనీశ్వరుని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ఆయన అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా శనీశ్వరుడి అనుగ్రహం కలగాలి అనుకున్న వారు శనివారం రోజు తప్పకుండా కొన్ని రకాల పనులు చేయాలట. మరి శనివారం రోజు ఎలాంటి పనులు చేస్తే శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శనివారం రోజు చేయవలసిన వాటిలో రావి చెట్టుకు నీరు సమర్పించడం కూడా ఒకటి. ప్రతి శనివారం రోజు రావి చెట్టుకు నీరు సమర్పించిన తరువాత ఏడు సార్లు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలట. అలాగే ఈ రోజున దానధర్మాలు చేయడం కూడా ప్రయోజనకరం. పేదవాడికి ఆహారాన్ని అందించాలనీ చెబుతున్నారు. శనివారం రోజు శనీశ్వరుని మనస్ఫూర్తిగా ఆరాధించారట. పూజా విధి నియమాలను పాటించాలని చెబుతున్నారు. తప్పులకు దూరంగా ఉండాలట. ఇక పూజ సమయంలో శనీశ్వరుడికి నీలి రంగు పుష్పాలను సమర్పించాలని చెబుతున్నారు. ఇలా చేస్తే శనీశ్వరుడు సంతోషిస్తారట.
అదేవిధంగా శనివారం రోజున నువ్వులు లేదంటే ఆవనూనె దానం చేయడం వల్ల మంచి జరుగుతుందని చెబుతున్నారు. ఉదయాన్నే నిద్ర లేచి తర్వాత ఒక గిన్నెలో ఆవాల నూనె తీసుకొని ఆ నూనెలో మీ ముఖాన్ని చూసుకొని ఆపై ఎవరికైనా అవసరమైన వారికి ఆ నూనె ను దానం చేస్తే అంతా మంచే జరుగుతుందని శని దోషం నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు. ఈ విధంగా శనివారం రోజు హనుమంతుడిని పూజించడం మంచిది అని చెబుతున్నారు.
శనీశ్వరుడితో పాటుగా హనుమంతుడిని పూజించి ఆయనకు సింధూరాన్ని సమర్పించాలట. ఆ తర్వాత హనుమాన్ చాలీసా పఠించాలని చెబుతున్నారు. హనుమంతుడిని పూజించడం వల్ల శనీశ్వరుడి ఆగ్రహం నుంచి ఉపశమనం లభిస్తుందట. శనివారం రోజున కొన్ని ప్రత్యేక మంత్రాలను పఠించడం కూడా ప్రయోజనకరం అంటున్నారు. ఈ రోజున శనీశ్వరుడిని పూజించడంతో పాటు “ఓం శనిశ్చరాయ నమః ” అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన శనిశ్వరుడి అనుగ్రహం లభిస్తుందట. కష్టాల నుండి విముక్తి పొందవచ్చని చెబుతున్నారు.