Shani Jayanti 2025: ఈ ఏడాది శని జయంతి ఎప్పుడు.. శని దోషాల నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలో తెలుసా?
ఈ ఏడాది శని జయంతి ఏ రోజు వచ్చింది. ఆరోజున ఏం చేయాలి? శని దోషం నుంచి విముక్తి పొందడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 12:00 PM, Mon - 12 May 25

సూర్య భగవానుడు ఛాయాదేవి ల కుమారులలో ఒకరైన శని దేవుని గురించి మనందరికీ తెలిసిందే. చాలామంది శనీశ్వరుడి పేరు వినగానే భయపడిపోతూ ఉంటారు. శనీశ్వరుడిని పూజించాలన్న ఆయన ఆలయాలకు వెళ్లాలి అన్న కూడా భయపడుతూ ఉంటారు. కానీ ఆయనను భక్తిశ్రద్ధలతో పూజించి కొలిచే వారికి ఎనలేని సంపదను ఇస్తారు అంటున్నారు పండితులు. మనం చేసిన కర్మలను బట్టి మాత్రమే శనిదేవుడు ఫలితాలను ఇస్తాడు. ఒకరికి మంచి చేసే ఆలోచనలు, మంచి స్వభావం, సమాజానికి హితమైన పనులు చేస్తే వారి జోలికి కూడా శనిదేవుడు పోడట.
కానీ ఒకరిని చూసి ఓర్వలేకపోవడం ఇతరుల సొమ్ములపై ఆశపడేవారు, ఒకటి చెడు కోరుకునే వారికి ఎప్పుడు కష్టాలను కలిగిస్తూనే ఉంటాడట. ఇలాంటి వారికి వారు చేసుకున్న కర్మలను బట్టి శనీశ్వరుడు జీవితంలో ఎదగకుండా దారుణమైన కష్టాలు ఇస్తాడని చెబుతున్నారు. ఇకపోతే ఆ సంగతి పక్కన పెడితే ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శని జయంతి వేడుకల్ని జరుపుకుంటూ ఉంటారు. అలా ఈ ఏడాది అనగా 2025 లో మే నెల 27వ తేదీన శని జయంతిని మనం జరుపుకోబోతున్నాం. ఈరోజున శనీకి ఇష్టమైన రీతిలో పూజలు చేస్తే మనకు జీవితంలో శని దోషాలు అస్సలు ఉండవట.
శనికి ఇష్టమైన రంగు నలుపు అందుకే నువ్వుల నూనె, నవధాన్యాలతో అభిషేకం చేయాలట. నల్లని బట్టను ఆయనకు సమర్పించాలని చెబుతున్నారు. అదే విధంగా శనీదేవుడి ప్రీతీ కొరకు కాకులు,నల్లని శునకం, నల్ల చీమకు ఏదైన ఆహారం తినడానికి పెట్టాలట. అంతేకాకుండా ఈరోజున ఆంజనేయస్వామికి తమలపాకుల పూజ, వెంకటేశ్వర స్వామికి పులిహోర వంటి నైవేద్యాలు సమర్పించిన కూడా శనీశ్వరుడు ఆనందపడతాడట. ఈ రోజున శనీశ్వరుడి పేరు మీదుగా పేదలకు దాన ధర్యాలు చేస్తే శనిదేవుడు ఆనంద పడిపొయి వారి దోషాల్ని దూరం చేస్తాడట. కాబట్టి శని జయంతి రోజున చేసేటటువంటి దానధర్మాలు పరిహారాలు విశేష ఫలితాలను అందిస్తాయని చెబుతున్నారు.