Nara Disti: మీ ఇంట్లో ఇలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయా.. అయితే మీ ఇంటికి నరదృష్టి తగిలినట్టే!
నరదిష్టి తగిలింది అని తెలిస్తే అలాంటప్పుడు కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయని చెబుతున్నారు పండితులు.
- By Anshu Published Date - 12:03 PM, Thu - 14 November 24

మామూలుగా చాలామంది నరదృష్టి తగిలిందని దిష్టి తగిలిందని అంటూ ఉంటారు. ఈ పదాలను మనం తరచుగా వింటూనే ఉంటాం. నరదృష్టి అంటే నెగిటివ్ ఎనర్జీ, ఈ నెగటివ్ ఎనర్జీ కారణంగా కొన్ని కొన్ని సార్లు ఇబ్బందులకు గురవాల్సి వస్తూ ఉంటుంది. కొందరి చూపులు అంతట మంచివి కావని అంటూ ఉంటారు. ఇకపోతే మీ ఇంట్లో కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తున్నాయి అంటే మీ ఇంటికి బాగా నరదిష్టి ఉందని అర్థం అంటున్నారు పండితులు. ఇంతకీ ఆ సంకేతాలు ఏంటి అన్న విషయానికి వస్తే..
మీ ఇంటి చుట్టుపక్కల కుక్కలు ఎక్కువగా ఏడుస్తున్నట్లు వినిపిస్తే మీ ఇంటి పైన అదృష్టం ఉందని అర్థం. అలాంటప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చేపిస్తే నష్టం జరగకుండా ఉంటుందట. అలాగే మీ ఇంట్లో ఎక్కడైనా బూజు పడుతుందంటే మీకు కష్టాలు రాబోతున్నాయని అర్థం అంటున్నారు. అందుకే ఎప్పటికప్పుడు ఇంట్లో బూజు తొలగించుకోవాలని చెబుతున్నారు. ఈ బూజు ఉండడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటుందట. అదేవిధంగా మీకు ఎలాంటి అనారోగ్య సమస్య లేకపోయినా ఉన్నట్లుండి అకస్మాత్తుగా కళ్ళు తిరిగి వికారంగా వాంతులు వచ్చినట్టు అనిపిస్తే మీకు దిష్టి తగిలిందని అర్థం అంటున్నారు.
అలాంటప్పుడు ఉప్పు లేదా నిమ్మకాయ వెంట్రుకలు వంటి వాటితో దిష్టి తీయించుకోవాలట. మీకు అర్ధరాత్రి మూడు గంటలలోపు అకస్మాత్తుగా మెలకువ వస్తే మీపై దుష్టశక్తుల ప్రభావం ఉన్నట్లే అని చెబుతున్నారు. అలాంటప్పుడు మీరు హనుమాన్ మంత్రాన్ని పఠించాలట. అలాగే మీ ఇంట్లో ఉన్నట్టుండి కలహాలు గొడవలు ప్రారంభమై తులసి మొక్క ఎండిపోతే మీ ఇంటికి నరదిష్టి ఉన్నట్లే అని అర్థం అంటున్నారు పండితులు.