Spirutal: దేవుడికి పూజ చేసేటప్పుడు ఈ వస్తువులు నేల మీద అస్సలు పెట్టకండి.. అవేటంటే?
మామూలుగా దేవుడికి పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా కొన్ని రకాల వస్తువులను నేల మీద అసలు పెట్టకూడదని చెబుతున్నారు పండితులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 10:35 AM, Sat - 10 May 25

మామూలుగా చాలా మంది పూజ చేసేటప్పుడు తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల లేని పోనీ సమస్యలు వస్తాయని చాలామందికి తెలియదు. అలాగే మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల పూజా చేసిన ఫలితం దక్కక పోగా లేని పోనీ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఇప్పటి తరంలో చాలా మందికి పూజ సమయంలో చేయకూడని పనులు, చేయవలసిన పనులు తెలియవు. పూజ సమయంలో కొన్ని వస్తువులు నేలపై ఉంచడం వల్ల ఆ పూజా ఫలితం దక్కదని చెబుతున్నారు. మరి ఇంతకీ ఎలాంటి వస్తువులను కింద ఉంచకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శాలిగ్రామం సాక్షాత్తు విష్ణుస్వరూపం. పైగా శాలి గ్రామాన్ని నీటిలో మాత్రమే పెడుతుంటారు. సాధారణంగా శాలి గ్రామం ఇంట్లో ఉంచి పూజ చేసుకునేవారు చాలా నియమనిష్టలతో ఉంటారు. అలాంటి శాలి గ్రామాన్ని పొరపాటున కూడా నేలపై అస్సలు ఉంచకూడదట. మాములుగా శంఖంలో లక్ష్మీదేవి నివిశిస్తుందని చెబుతుంటారు. దీని వల్ల పూజ సమయంలో శంఖాన్ని నేలపై ఉంచడం వల్ల లక్ష్మీదేవి కోపిస్తుందట. అలా జరిగితే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయని చెబుతున్నారు. అదేవిధంగా పూజ చేసేటప్పుడు చాలా చేసే తప్పు ప్రమిదను నేలపై పెట్టి దీపం వెలిగించి ఆ తరువాత ఆ దీపాలు దేవుడి ముందు, తులసి కోట దగ్గర పెడుతుంటారు. దీపాలను కింద పెట్టకూడదట. ఎల్లప్పుడూ ఒక పళ్లెంలో దీపాలను పెట్టి ఆ తరువాత వెలిగించుకోవాలట.
అలాగే బంగారాన్ని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారట. అలాంటి బంగారాన్ని నేలపై ఉంచడం వల్ల లక్ష్మీదేవిని అవమానించినట్టే అవుతుందని చెబుతున్నారు. అందుకే బంగారాన్ని నైలపై ఉంచడం మంచిది కాదని, ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. దేవుడి పటాలు లేదా విగ్రహాలను నేలపై ఉంచకూడదట. కనీసం శుభ్రం చేసే సమయంలో అయినా సరే దేవుడి విగ్రహాలను పటాలను నేరుగా నేలపై ఉంచకూడదని, కనీసం ఒక కాగితం లేదా వస్త్రం వేసి అయినా వాటి మీద విగ్రహం లేదా పటాలను ఉంచాలని చెబుతున్నారు.