Soma Pradosha Vratham 2022 : ఇవాళ సోమప్రదోష వ్రతం…మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించండి..!!
ఇవాళ సోమప్రదోష వ్రతం. హిందూమతంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతిత్రయోదశితిథినాడు ప్రదోష వ్రతం నిర్వహిస్తారు. ఇది సోమవారం రావడంతో దీనిని సోమప్రదోష వ్రతం అని అంటారు.
- By hashtagu Published Date - 07:00 AM, Mon - 11 July 22

ఇవాళ సోమప్రదోష వ్రతం. హిందూమతంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతిత్రయోదశితిథినాడు ప్రదోష వ్రతం నిర్వహిస్తారు. ఇది సోమవారం రావడంతో దీనిని సోమప్రదోష వ్రతం అని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటూ…శివుడిని ఆరాధిస్తారు. అంతేకాదు ఇదేరోజున నాలుగు శుభయోగాలు కూడా ఏర్పాడుతున్నాయి. అవే సర్వార్థసిద్ధి యోగం, రవియోగం, శుక్లయోగం, బ్రహ్మయోగం. పంచాంగం ప్రకారం ఈరోజు అనురాధ నక్షత్యం, జ్యేష్ట నక్షత్రం కూడా ఉన్నాయి. ఇన్ని ఏర్పాడుతున్నాయి కాబట్టి జులై 11కు చాలా విశేషం ఉంది. ఈరోజు శుభకార్యాలకు మంచి రోజు. సోమప్రదోష వ్రతం రోజు శుభ సమయం సాయంత్రం 7.22 నుంచి రాత్రం 09.24 వరకు ఉంది.
వ్రతపూజా విధానం…
సోమప్రదోష వ్రతాన్ని సూర్యాస్తమయానికి 45నిమిషాల ముందు నుంచి సూర్యాస్తమయం తర్వాత 45 నిమిషాల వరకు పూజలు చేస్తారు. ఈ కాలాన్ని ప్రదోషం కాలం అంటారు. ఇందులో శివునికి నియమ నిష్టలతో పూజలు నిర్వహిస్తారు. ఉదయాన్నే స్నానమాచరించి శుభ్రమైన దుస్తువులు ధరించి శివుడికి పూజలు చేయడం ప్రారంభిస్తారు. ఒక రాగి పాత్రలో స్వచ్చమైన తేనేను తీసుకుని శివలింగాన్ని అభిషేకించండి. తర్వాత జలాభిషేకం చేయండి. ఆరాధన సమయంలో ఓ నమ:శివాయ లేదా సర్వసిద్ధి ప్రదయే నమ: అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. తర్వాత ప్రదోషవ్రత కథ, శివచాలీసా పఠించండి. చివరగా పరమేశ్వరుడికి హారతి ఇచ్చి పూజను పూర్తి చేయాలి. ఈ రోజు మహామ్రుత్యుంజయ మంత్రాన్ని పఠించడం వల్ల కూడా ఏంతో మేలు జరుగుతుంది.