Navratri 2022: నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం అవుతున్నాయి..కలశం ఏర్పాటుకు ముహుర్తం ఎప్పుడు..?
హిందూమతంలో నవరాత్రులకు చాలా ప్రాముఖ్యం ఉంటుంది. ఈ నవరాత్రుల్లో దుర్గామాతను 9 రోజుల పాటు ఇంట్లో ప్రతిష్టిస్తారు.
- By hashtagu Published Date - 07:02 PM, Sat - 17 September 22

హిందూమతంలో నవరాత్రులకు చాలా ప్రాముఖ్యం ఉంటుంది. ఈ నవరాత్రుల్లో దుర్గామాతను 9 రోజుల పాటు ఇంట్లో ప్రతిష్టిస్తారు. అఖండ జ్యోతితో అమ్మవారు కొలువుదీరుతుంది. ఈ సమయంలో భక్తిశ్రద్దలతో దుర్గామాతను పూజిస్తారు. ఈ నవరాత్రి పండగ సందర్భంగా తొమ్మిది రోజులు పాటు తొమ్మిది రూపాల్లో అమ్మవారిని కొలుస్తారు. హిందూక్యాలెండర్ ప్రకారం శారదీయ నవరాత్రులు అశ్వనీ మాసం శుక్లపక్షంలో ప్రారంభం అవుతాయి. ఈ సారి నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 26సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. నవరాత్రుల్లో మొదటిరోజు ఘటస్థాపన చేస్తారు. ఈ నవరాత్రి ఘటస్థాపన అంటే ఏమిటి…ఏవిధంగా చేస్తారు..శుభ సమయంలో ఎప్పుడు తెలుసుకుందాం.
ఘటస్థాపన పూజ విధి:
ఘాట్ అంటే మట్టికుండ. ఇదినవరాత్రి మొదటి రోజు స్థాపిస్తారు. ఇంట్లో ఈశాన్య మూలలో ఘాట్ ను పెట్టుకోవాలి. ముందుగా కుండలో కొంత మట్టివేసి పైన బార్లీ వేయాలి. ఘాట్ ఏర్పాటు చేసే స్థలాన్ని శుభ్రం చేసి…అక్కడ గంగాజలం చల్లి ఆ స్థలాన్ని శుద్ధి చేయాలి. తర్వాత ఒక చెక్కపీఠపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి…దానికి పై దుర్గా మాత విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేయండి. ఇఫ్పుడు రాగిచెంబులో నీళ్లు నింపు దాని పైభాగంలో ఎర్రటి మొలిని కట్టాలి. ఆ కలశంలో నాణెం, అక్షతం, తమలపాకులు, ఒక జత లవంగాలు, దుర్వ గడ్డి వేయండి. ఇప్పుడు కలశంపై మామిడి ఆకులు, కొబ్బరికాను ఎర్రటి గుడ్డతో చుట్టాలి. కలశం చుట్టూ పండ్లు, స్వీట్లు, ప్రసాదాలు ఉంచాలి. కలశ స్థాపన పూర్తయిన తర్వాత అమ్మవారికి పూజలు చేయాలి.
నవరాత్రి ఘటస్థాపన ముహూర్తం:
అశ్విన్ ఘటస్థాపన, సోమవారం, సెప్టెంబర్ 26, 2022
ఘటస్థాపన ముహూర్తం – ఉదయం 06.28 నుండి 08.01.00 వరకు
వ్యవధి – 01 గంట 33 నిమిషాలు
ఘటస్థాపన అభిజీత్ ముహూర్తం – మధ్యాహ్నం 12:06 నుండి 12:54 వరకు
నవరాత్రి శుభ యోగ ముహూర్తం:
అశ్విన్ నవరాత్రి సోమవారం, సెప్టెంబర్ 26, 2022
ప్రతిపాద తేదీ ప్రారంభమవుతుంది – సెప్టెంబర్ 26, 2022 ఉదయం 03:23 గంటలకు
ప్రతిపాద తేదీ ముగుస్తుంది – సెప్టెంబర్ 27, 2022 ఉదయం 03:08 గంటలకు ముగుస్తుంది
నవరాత్రి ఘటస్థాపనకు కావాల్సిన వస్తువులు:
పసుపు, కుంకుమ, కర్పూరం, జానేవు, అగరుబత్తీలు,మామిడి ఆకులు, పూజ పాన్, హార-పువ్వు, పంచామృతం, బెల్లం కొప్పలు, ఖరీక్, బాదం, తమలపాకులు, నాణేలు, కొబ్బరి కాయ, ఐదు రకాల పండ్లు, చౌకీ సీట్, నైవేద్యం మొదలైనవి.
నవరాత్రి తేదీ:
ప్రత్తిపాద (మాత శైలపుత్రి): 26 సెప్టెంబర్ 2022 ద్వితీయ
(తల్లి బ్రహ్మచారిణి): 27 సెప్టెంబర్ 2022
తృతీయ (తల్లి చంద్రఘంట): 28 సెప్టెంబర్ 2022
చతుర్థి (తల్లి కూష్మాండ): 29 సెప్టెంబర్ 2022
పంచమి (తల్లి స్కందమాత)30 సెప్టెంబర్ 2022
01 అక్టోబరు 2022
సప్తమి (తల్లి కాళరాత్రి): 02 అక్టోబర్ 2022
అష్టమి (తల్లి మహాగౌరి): 03 అక్టోబర్ 2022
నవమి (తల్లి సిద్ధిదాత్రి): 04 అక్టోబర్ 2022
దశమి (మాత దుర్గా చిత్ర నిమజ్జనం): అక్టోబర్ 5