HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Devotional
  • >Month Of May Auspicious For Saryanarayana Vrata

Satyanarayana Vratam: మే నెలలో సత్యనారాయణస్వామి వ్రతానికి శుభముహుర్తం ఎప్పుడో తెలుసా..?

పురాణాల ప్రకారం...సత్యనారాయణస్వామి ఆరాధానకు చాలా ప్రాముఖ్యత ఉంది. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కొత్తగా పెళ్లైన జంటలు చేస్తుంటారు.

  • By Hashtag U Published Date - 03:53 PM, Fri - 13 May 22
  • daily-hunt
Satyanarayan Puja
Satyanarayan Puja

పురాణాల ప్రకారం…సత్యనారాయణస్వామి ఆరాధానకు చాలా ప్రాముఖ్యత ఉంది. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కొత్తగా పెళ్లైన జంటలు చేస్తుంటారు. అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశించిన శుభ సందర్భాన కూడా సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తారు. ఇలా చేస్తే వల్ల తమ జీవితంలో ఎలాంటి ఆటంకాలు కలగవని నమ్మకం. పురాణాల ప్రకారం శ్రీ మహా సత్యనారాయణ స్వామి.. శ్రీ మహా విష్ణువు స్వరూపమే అని అంటుంటారు. తాము చేపట్టే పనులన్నింటిలో విజయం సాధించాలని కోరుతూ గణపతి పూజ, శ్రీ సత్యనారాయణ పూజ నిర్వహిస్తారు. 2022లో సత్యనారాయణ పూజ ఎప్పుడు చేయాలి? శుభ ముహుర్తం ఎప్పుడు ఉంది. సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏంటి. ఈ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..

సత్యనారాయణ పూజ ఎప్పుడంటే..
2022 సంవత్సరంలో మే నెలలో 15వ తేదీన అంటే ఆదివారం శుక్ల పూర్ణిమ రోజున సత్యనారాయణ పూజ చేయించుకుంటే మంచిది.

వైశాఖ శుక్ల పూర్ణిమ తిథి ప్రారంభం ఎప్పుడు: మే 15 మధ్యాహ్నం 12:45 గంటలకు

పూర్ణమి తిథి ముగింపు : మే 16 రాత్రి 9:43 గంటలకు

అదే విధంగా ఇదే ఏడాదిలో ఈ కింద పేర్కొన్న తేదీల్లో కూడా సత్యనారాయను జరుపుకోవచ్చు.

జూన్ 14

జులై 13

ఆగస్టు 11

సెప్టెంబర్ 10

అక్టోబర్ 9

నవంబర్ 8

డిసెంబర్ 7

పూజకు కావాల్సిన సామాగ్రి..

సత్యనారాయణ స్వామి పూజను పౌర్ణమి రోజులలో జరుపుకోవచ్చు. చెక్కపీటను శుభ్రం చేసి, నాలుగు వైపులా అరటిఆకులు, మామిడాకులతో అలకరించాలి. శ్రీ విష్ణుమూర్తి విగ్రహం కానీ
ఫొటోను ప్రతిష్టించాలి. ఒక పాత్రలో నవగ్రహ ధాన్యాలను ఉంచాలి. వీటితో పాటు
* బియ్యం
* రూపాయి నాణేలు(నలభై)
* ఎండు ఖర్జూర(50)
* తమలపాకులు(100)
* పూలమాలలు, విడి పువ్వులు,
* తులసీ ఆకులు,
* కలశం కింద పెట్టేందుకు తెలుపు కానీ పసుపు ఎర్రని వస్త్రం,
* కలశం పైన పెట్టడానికి ఎరుపు రంగు వస్త్రం,
*ప్రధాన కలశానికి పెద్ద చెంబు, ఉప కలశానికి చిన్న చెంబు, దాంట్లో శుభ్రమై మంచి నీరు ఉంచాలి.
* అభిషేకానికి పంచామ్రుతాలు
* అగరబత్తీలు లేదా సాంబ్రాణి
* మట్టి దీపాలు
* నైవేద్యానికి నూక ప్రసాదం, పండ్లు
* హారతి పళ్లెం, కర్పూరం
* చేతులను శుభ్రం చేసుకునేందుకు మంచి వస్త్రం
* కూర్చోవడానికి పీట.

వ్రత విధానం..
సత్యనారాయణ స్వామి వ్రతం చేసే వారు చాలా పద్దతితో ఆచరించాలి. ఆ స్వామివారిని తలచుకుంటూ ఉదయం నుండే ఉపవాసం ఉండి సాయంత్రం వ్రతం చేసుకోవాలి. మీ ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణం కట్టాలి. గుమ్మానికి పసుపు కుంకుమతో చక్కగా అలంకరించాలి. వాకిట్లో గోవు పేడతో అలికి బియ్యం పిండితో ముగ్గులు వేయాలి. ఇక వ్రతం చేసే ప్రాంతంలోతెల్లని వస్త్రం తీసుకుని…దానిపై బియ్యం పోసి ఒక పీఠం తయారుచేసుకోవాలి. దాని మధ్యలో కలశం చెంబును ఉంచాలి. అందులో నీరుపోసి, మామిడాకులు, వాటిపై కొబ్బరికాయ ఉంచాలి. తర్వాతదానిపై కొత్త వస్త్రాన్ని శంఖం ఆకారంలో చుట్టించాలి. అలాగే గంధం కుంకుమను పెట్టాలి. శ్రీ సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని ప్రధాన కలశం వెనుకగా పెట్టాలి. గంధం కుంకుమ పెట్టి పూలతో అలకంరించుకోవాలి. ముందుగా పసుపు గణపతి పూజ చేయాలి.తర్వాత ఇతర దేవుళ్ల పూజలను చేయాలి.

పాటించాల్సిన ఆచారాలు..
ఇక సత్యనారాయణ పూజ చేసే ముందు గణపతిని పూజించాలి. తర్వాత ఇంద్రుడితో పాటు రాముడు, సీత, రాధాక్రిష్ణులను పూజించాలి. ఆ తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామిని పూజించాలి. సత్యనారాయణుని ఆరాధన తర్వాత లక్ష్మీదేవిని, పార్వతీ పరమేశ్వరులు, బ్రహ్మదేవుళ్లను పూజించాలి. స్వామివారికి హారతి సమర్పించాలి.అనంతరం పూజకు వచ్చినవారికి లేదా దేవాలయానికి వచ్చిన భక్తులకు ప్రసాదాన్ని పంచాలి. అనంతరం పూజలు చేసిన పూజారులకు కూడా పాదాలకు నమస్కరించి బట్టలు, పండ్లు ఫలహారాలు సమర్పించాలి.

సత్య నారాయణ వ్రత ప్రాముఖ్యత..
పూర్వ కాలంలో నర మహర్షి భూమిపై ప్రజలు పడుతున్న బాధల నుంచి తప్పించేందుకు అప్పట్లో విష్ణుమూర్తిని ఆశ్రయించాడు. సత్యనారాయణను పూజిస్తే ప్రజల కష్టాలు తీరతాయని మహా విష్ణువు సూచించాడు. దీంతో సత్యనారాయణనుని ఆరాధన వల్ల శ్రీ నారాయణుని అనుగ్రహంతో పాటు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చాలా మంది నమ్ముతుంటారు..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotional pooja
  • may auspicious month
  • rituals
  • satyanarayana vratam

Related News

Parivartini Ekadashi 2025

Parivartini Ekadashi 2025: రేపే పరివర్తిని ఏకాదశి వ్రత పారన.. మనం ఏం చేయాలంటే?

సూర్యోదయం ముందు ఏకాదశి వ్రత పారనకు ఎటువంటి నియమాలు, పద్ధతులు లేవు. అయితే ద్వాదశి తిథి ముగిసేలోపు దీనిని పారన చేయాలి. అంతేకాకుండా మీరు ద్వాదశి నాడు అన్నం తిని పారన చేయాలి.

    Latest News

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

    • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd