Money Remedies: సంపద రెట్టింపు అవ్వాలంటే చీమలకు ఈ ఆహారం పెట్టడంతో పాటు ఎన్నో పరిహారాలు?
ఇప్పుడు చెప్పబోయే అనేక రకాల పరిహారాలు పాటిస్తే మీ సంపద రెట్టింపు అవుతుందని చెబుతున్నారు పండితులు.
- By Anshu Published Date - 10:00 AM, Fri - 14 February 25

డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే దానిని నిలబెట్టుకోవడం ఆ సంపాదనను రెట్టింపు చేసుకోవడం అన్నది మరొక ఎత్తు అని చెప్పాలి. సంపాదన రెట్టింపు అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకోసం ఏం చేయాలి అన్నది చాలామందికి తెలియదు. సంపాదన రెట్టింపు అవ్వాలంటే కొన్ని రకాల పరిహారాలు పాటించాలని చెబుతున్నారు. ఇంతకీ ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నల్లటి ఒక ఉట్టిని తీసుకువచ్చి వంటింట్లో వేలాడదీయాలట. ఏ ఇంట్లో అయితే నల్లటి ఉట్టి వేలాడుతూ ఉంటుందో, ఆ ఇంట్లో డబ్బు బాగా పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే చాలా మంది గోధుమ పిండి కోసం గోధుమలను మర ఆడించడానికి ఇస్తుంటారు. అయితే గోధుమలు మర ఆడించడానికి ఇచ్చేముందు అందులో 11 తులసి ధలాలు, రెండు పసుపు కొమ్ములు వేయాలట. తర్వాత వాటిని మర ఆడించడానికి ఇవ్వాలట. అప్పుడు వచ్చిన గోధుమ పిండిని ఉపయోగిస్తే అనేక మార్గాల్లో ధనం వస్తుందని చెబుతున్నారు.
మేడిచెట్టు వేరుకి చాలా శక్తి ఉంది. మేడిచెట్టు మీ ఇంటి పరిసరాల్లో, లేదంటే ఎక్కడ అయినా కనిపిస్తే దాని వేరును ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినటువంటి రవి పుష్యయోగమున్న రోజు గానీ లేదా గురువారం పుష్యమి నక్షత్రం కలిసివ చ్చినటువంటి గురు పుష్య యోగం ఉన్న రోజు ఇంటికి తీసుకురావాలట. దానిని పూజ గదిలో ఉంచాలని, ఇలా చేస్తే ఇంట్లో కనకవర్షం కురుస్తుందని చెబుతున్నారు. వీలైతే మేడిచెట్టు వేరుని తాయత్తులాగా శరీరానికి కట్టుకోవాలని చెబుతున్నారు.
మేడిచెట్టు వేర్లు దొరకపోతే.. మర్రి చెట్టు ఆకులతో ఒక పరిహారాన్ని చేయవచ్చట. గురు పుష్య యోగమున్న రోజు లేదా రవి పుష్య యోగమున్న రోజున ఆరు మర్రిచెట్టు ఆకులను ఇంటికి తీసుకువచ్చి,ఆ ఆకులను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలట. వాటిపై తడి పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసి పూజ గదిలో పెట్టి, అవి ఎండిపోయేంత వరకు అలానే ఉంచాలట. మర్రి చెట్టు ఆకులు ఇంట్లోని పూజగదిలో ఉండడం వల్ల ధనవృద్ధి కలుగుతుందట. మాములుగా అందరూ చీమలకు చక్కెర పెడుతుంటారు. కానీ, ఇలా చేయడం కంటే ఉదయం నిద్రలేవగానే ఎండు కర్జూరపు పొడి, పంచదార, కొబ్బరి కలిపి చీమలకు పెట్టాలట. ఇలా చేస్తే ధనవృద్ధి కలుగుతుందని చెబుతున్నారు.