Lord Ganesha: కలలో వినాయకుడు కనిపిస్తున్నాడా.. అయితే మంచో చెడో తెలుసుకోండి?
సాధారణంగా మనం పడుకున్నప్పుడు ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. అయితే అందులో కొన్ని మంచి కలలు
- By Anshu Published Date - 06:00 AM, Mon - 19 December 22

సాధారణంగా మనం పడుకున్నప్పుడు ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. అయితే అందులో కొన్ని మంచి కలలు అయితే మరికొన్ని చెడ్డ కలలు వస్తుంటాయి. స్వప్న శాస్త్రంలో నిద్రలో వచ్చే ప్రతి కలకి భిన్నమైన అర్థాలు చెప్పబడ్డాయి అన్న విషయం తెలిసిందే. మరి కలలో వినాయకుడు కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అలాగే వినాయకుడు కనిపించడం మంచిదేనా లేకపోతే ఏమైనా కీడు జరుగుతుందా అన్న వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా కలలో భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను సూచిస్తాయి అని చెబుతూ ఉంటారు. కలలో దేవుడిని దర్శనం చేసుకోవడం అన్నది చాలా ఆహ్లాదకరమైన కలగా చెప్పవచ్చు.
అయితే కలలో వినాయకుడు కనిపిస్తే దాని కూడా ఓ ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. కలలు సాధారణంగా ప్రతి మనిషికి వస్తుంటాయి. అదే సమయంలో కలలు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను కూడా సూచిస్తాయి. గణేశ విగ్రహాన్ని కలలో చూడటం చాలా శుభప్రదంగా చెప్పవచ్చు. కలలో వినాయకుడు కనిపించడం వల్ల మీరు కొన్ని శుభవార్తలను అందుకోబోతున్నారని దాని అర్థం. అలాగే ఇంట్లో కొన్ని శుభకార్యాలు లేదా మతపరమైన పనులు జరుగుతాయి. అయితే ఆ కల గురించి ఎవరికీ చెప్పకూడదు. కలలో శివ కుటుంబం కనిపిస్తే అది కూడా శుభసూచకమే. అంతేకాకుండా అన్ని కష్టాల నుండి విముక్తి పొందబోతున్నారని అర్థం. అదే సమయంలో లాభం ఉంటుంది.
వినాయకుడు స్వారీ చేస్తున్నట్టు కలలో కనిపిస్తే మీరు ఏదైనా మతపరమైన లేదా మరేదైనా యాత్రకు వెళ్లవచ్చని అర్థం. అలాగే ఈ ప్రయాణం మీకు శుభదాయకంగా ఉంటుంది. అలాగే కలలో గణేష్ ని పూజిస్తున్నట్లు వస్తే శుభసంకేతంగా చెప్పుకోవచ్చు. త్వరలోనే కోరికలన్నీ నెరవేరబోతున్నాయని, అడ్డంకుల దీవెనలు పొందబోతున్నారని అర్థం. అలాగే మీ పనిలో ఏదైనా నిలిచిపోయినట్లయితే అది పూర్తవుతుంది. అలాగే కలలో నిమజ్జనం చేస్తున్నట్లుగా కనిపిస్తే అది అశుభ సంకేతంగా చెప్పుకోవచ్చు. దానివల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థికంగా నష్టపోవచ్చు.