Astro : కుబేరున్ని విగ్రహాన్ని పూజాగదిలో ఈ దిశలో ఉంచితే..డబ్బే డబ్బు..!!
ఇంట్లో ఐశ్వర్యం సిద్ధించాలంటే లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ధనాన్ని ఎలాంటి లోటుండదు.
- By hashtagu Published Date - 06:00 PM, Sat - 3 September 22

ఇంట్లో ఐశ్వర్యం సిద్ధించాలంటే లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ధనాన్ని ఎలాంటి లోటుండదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇంట్లో ఆర్థిక కష్టాలు ఉండకూడదంటే కుబేరున్ని పూజిస్తే…సిరిసంపదలకు ఎలాంటి లోటు ఉండదు. కుబేరుడు ధనానికి, నవనిధులకు అధిపతి. ఉత్తర దిక్పాలకుడు కాబట్టి కుబేరున్ని పూజిస్తే సిరిసంపదలను అనుగ్రహిస్తాడు.
కుబేరుడిని పూజించాలంటే…మీ పూజాగదిలో ఉత్తరం దిక్కున కుబేరుడి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్నికానీ ఉంచాలి. చెక్క పీటపై పసుపు లేదా ఎర్రన్ని వస్త్రాన్ని పరచాలి. దానిపై కలశాన్ని ఉంచాలి. ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి. ఈ కలశాన్ని పూజించిన తర్వాత కుబేరుని యంత్రాన్ని ఉంచి పంచామృతంతో అభిషేకం చేయాలి. కుబేరుని యంత్రంతోపాటు ధన్వంతరీ భగవానుల చిత్రపటాలను కూడా పూజలో ఉంచాలి.
ఇప్పుడు కుబేరుడికి ధాన్యం, బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. ఇంట్లో ఉన్న బంగారు, వెండి నాణేలు, ఆభరణాలను శుభ్రం చేసి పూజలో ఉంచి పూజ ప్రారంభించాలి. ఐదు సార్లు ఓం గం గణపతయే నమ: అని జపించాలి. ఓం శ్రీ కుబేరాయ నమ: ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమ: అనే మంత్రాలను తులసి మాలతో 108 సార్లు జపించాలి.
పూజలో కాంస్యం లేదంటే ఇత్తడి ఆభరణాలను కుంకుమ, సింధూరం, అక్షింతలతో పూజించాలి. పూజగదిలో స్వస్తిక్ గుర్తును ఉంచాలి. ఈ పూజను సాయంత్రం చేస్తే ఈ కుబేరుడి ఆశీస్సులు మీపై ఉండి…మీ సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుుతున్నారు.
Related News

Hibiscus: అలాంటి సమస్యలు మిమ్మల్ని వేదిస్తున్నాయా.. అయితే మందారాలతో ఈ పరిహారం చేయాల్సిందే?
ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఎంత సంపాదించినప్పటికీ డబ్బులు చేతిలో మిగలక ఆర్థిక సమస్యలతో స