Spirituality: ఐశ్వర్యంతో పాటు సుఖ సంతోషాలు పెరగాలంటే కుబేరుడికీ ఇలా పూజ చేయాల్సిందే?
కుబేరుడి అనుగ్రహం కలగడం కోసం తప్పకుండా కొన్ని మంత్రాలు పటించాలట.
- By Nakshatra Published Date - 11:00 AM, Wed - 4 September 24
మామూలుగా ఇంట్లో అలాగే పూజా మందిరంలో వ్యాపార స్థలాలలో కుబేరుడి విగ్రహాన్ని పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. కుబేరుడి ఆశీర్వాదం అనుగ్రహం కలిగితే డబ్బుకు లోటు ఉండదని కోటీశ్వరులు అవుతారని చాలామంది భావిస్తుంటారు. మరి అలాంటి కుబేరుడి అనుగ్రహం కలగాలంటే ఆయనను తప్పకుండా పూజించాలట. మరి ఎలా పూజిస్తే ఆయన అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కుబేర ధనప్రాప్తి మంత్రం… ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒకరి మనస్సులో ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఎక్కువ సంపద సొంతం కావాలన్న కలను నెరవేర్చడానికి సమయం పడుతుందట.
కొత్త ఇల్లు, కారు కల కూడా నెరవేరుతుందని నమ్ముతారు. అంతే కాదుఈ మంత్రాన్ని పఠించేటప్పుడు మీరు ఏమనుకున్నా అది అమలు అవుతుంది. అందుకే మనస్సులోని అన్ని కోరికలను నెరవేర్చడానికి కుబేర ధన ప్రాప్తి మంత్రం “ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః ” అనే మంత్రాన్ని తప్పకుండా జపించాలని చెబుతున్నారు. అలాగే ” ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యదీప్తాయే ధనధాన్యసమృద్ధిం మి దేహీ దాపయా శ్వాహ ” అనే కుబేర మంత్రాన్ని జపించడం వల్ల ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు సంపద లభిస్తుందట. అలాగే ఇంట్లో అశాంతి నెలకొనడం గొడవలు వంటి ప్రమాదాలు తగ్గుతాయని చెబుతున్నారు. సిరిసంపదలకు అధిపతి శ్రీ మహాలక్ష్మి దేవి. అయితే ఈ సిరిసంపదలకు కాపలాదారుడుగా కుబేరుడు ఉంటాడు.
కాబట్టి వీరిద్దరిని కలిపి పూజించడం వల్ల సకల సంపదలు చేకూరతాయని చెబుతున్నారు. అదేవిధంగా కోల్పోయిన అష్టైశ్వర్యాలు కూడా చేకూరతాయని చెబుతున్నారు. మీరు కనుక అంతులేని సంపదను పొందాలి అనుకుంటే అందుకోసం ” ఓం శ్రీం హ్రీ క్లీం లక్ష్మీ కుబేరాయ నమః ” అనే మంత్రాన్ని రోజు 108 లేదా 1008 సార్లు ఉచ్చరించడం వల్ల అనుకున్న కార్యాలసిద్ధిస్తాయట. ఉత్తరం దిశను చూస్తున్నట్లు కూర్చుని ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు పెరుగుతాయని చెబుతున్నారు. అదేవిధంగా” ఓం యక్ష రాజాయ విద్మయా అలిక దేషాయా ధీమహి తన్నా కుబేర ప్రచోదయాత్ ” అనే గాయత్రీ కుబేర మంత్రాన్ని జపించడం వల్ల తప్పకుండా కుబేరుడి అనుగ్రహం కలుగుతుందట. మీరు కనీసం 21 రోజులు పఠించాలి. ఎందుకంటే అలా చేయడం వల్ల ప్రయోజనాలకు సరిపోయే అవకాశాలు పెరుగుతాయి. పైన మంత్రాలు చెప్పిన మంత్రాలను పఠిస్తున్న సమయంలో కుబేరుని విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకుని పూజ చేస్తూ పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
Related News
Spirituality: కిచెన్ లో పూజ గది ఉందా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
కిచెన్ లో పూజ గది ఉండడం మంచిదే కానీ కొన్ని రకాల విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.