Krishnashtami 2024: కృష్ణాష్టమి రోజున ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలు.. అదృష్టం మీ వెంటే!
కృష్ణాష్టమి రోజున కొన్ని రకాల వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 02:30 PM, Fri - 23 August 24

ప్రతి ఏడాది శ్రీకృష్ణుడు జన్మించిన రోజునే కృష్ణాష్టమిగా జరుపుకుంటూ ఉంటారు. ఈరోజును సాక్షాత్తు శ్రీకృష్ణుడే జన్మించిన రోజుగా భావిస్తారు.
ఈ కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుని పూజించడమే కాకుండా ఆయనకి ఎంతో ఇష్టమైన కొన్ని వస్తువులను ఇంటికి కొనుక్కొని తీసుకు రావడం వల్ల అదృష్టం రెట్టింపు అవుతుందట. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా ఎంతో సులభంగా నెరవేరుతాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఎలాంటి వస్తువులు ఇంటికి తీసుకుని వస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పురాణాల ప్రకారం కృష్ణాష్టమి రోజున ఇంటికి నెమలీకను తెచ్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరగడమే కాకుండా ధన లాభాలు కలుగుతాయట. నెమలి ఈకను కృష్ణాష్టమి పండుగ రోజున ఇంటికి తీసుకుని రావడం వల్ల కుటుంబంలో సత్సంబంధాలు కూడా మెరుగుపడతాయట. అంతేకాకుండా జీవితంలో ఒత్తిడి ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని పండితులు చెబుతున్నారు. అలాగే కృష్ణాష్టమి పండుగ రోజున శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన వేణువును ఇంటికి తీసుకు రావడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా దీనిని ఇంట్లో పెట్టడం వల్ల ఇంటికి ఉన్న వాస్తు వాస్తు దోషం కూడా తొలగిపోతుందట. ఆ వేణువును ఇంట్లో ఉంచడం వల్ల కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాపార కార్యాలయాల్లో దీనిని ఉంచడం వల్ల పురోగతి కూడా లభిస్తుందని పండితులు చెబుతున్నారు. కృష్ణాష్టమి రోజున సరస్వతీ దేవి చేతిలో ఉండే వీణను ఇంటికి తీసుకురావడం వల్ల కూడా అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా పిల్లల చదువులపై ఏకాగ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయట. శ్రీకృష్ణుడికి ఈ రోజు తేనెతో నైవేద్యాన్ని సమర్పించడం వల్ల పుణ్యఫలం దక్కడంతోపాటు భక్తుల కోరికలు కూడా నెరవేరుతాయిని పండితులు చెబుతున్నారు.