Koti Deepotsavam 2023: దేదీప్యమానంగా వెలిగిపోతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవ కార్యక్రమం
మాములుగా దీపావళి పండుగ తర్వాత కార్తీకమాసం మొదలవుతుంది. ఈ కార్తీకమాసంలో ఎక్కడ చూసినా కూడా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తూ ఉంటుంది. కార్తీకమాసం అంటే శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైంది.
- By Praveen Aluthuru Published Date - 02:36 PM, Mon - 20 November 23

Koti Deepotsavam 2023: మాములుగా దీపావళి పండుగ తర్వాత కార్తీకమాసం మొదలవుతుంది. ఈ కార్తీకమాసంలో ఎక్కడ చూసినా కూడా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తూ ఉంటుంది. కార్తీకమాసం అంటే శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైంది. ఈ మాసంలో ఆలయాలన్ని దీపాల వెలుగులో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా శివాలయాలు ఈ కార్తీక మాసం మొత్తం దీపాలతో వెలిగిపోతూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే దాదాపుగా పది సంవత్సరాలుగా కార్తీకమాసంలో హైదరాబాద్‌లో కోటీ దీపోత్సవం కార్యక్రమంని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. న్యూస్ చానెల్ ఎన్టీవీ, భక్తిటీవీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా రచనా టెలివిజన్ ప్రతీ ఏటా ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.
అయితే ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తి టీవీ ఎన్ టీవీ ఆధ్వర్యంలో దాదాపుగా 14 రోజులపాటు ఈ కోటి దీపావస్వామి కార్యక్రమం జరగనుంది. శివకేశవులని ఒకేవేదికపై కోటీదీపాల మధ్య దర్శించుకునే యోగమే కోటి దీపోత్సవం. జనం గుండె లోతుల్లో దాగిన భక్తిభావాలను ఒక్క వేదిక మీదకు తెచ్చే పవిత్ర ప్రయోగమే ఈ కోటిదీపోత్సవం. వేల,లక్షల సంఖ్యలో భక్తులు,వేద పండితులు, అతిథులు, అతిరథ మహారధుల మధ్య ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం వైభవంగా జరుగుతూ ఉంటుంది. ప్రవచనామృతంతో మొదలై, ప్రత్యేక అర్చనలతో పవిత్రత సంతరించుకుని, దేవదేవుల కళ్యాణ మహోత్సవాలు, లింగోద్భవం, నీరాజనాలతో భక్తులకు నిండైన ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రతిరోజూ పంచుతుంది దీపోత్సవం కార్యక్రమం.
ఈ 14 రోజులపాటు ఈ ప్రాంగణం అంతా కూడా శివనామ స్మరణలతో మారుమోగుతూ ఉంటుంది. ఎక్కడినుంచో వేలాదిమంది భక్తులు తరలివచ్చి ఆ పరమేశ్వరుని దర్శించుకుని ఈ కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. దేశం నలుమూలల నుంచి పీఠాధిపతులు, మహాయోగలు, ఆధ్యాత్మికవేత్తల సందేశాలతో కోటిదీపోత్సవ వేదిక ఒక ఆధ్యాత్మిక దివ్యఅనుభూతికి నిలయంగా మారుతుంది. అన్నిటికంటే మించి భక్తులు అందరూ ఎంతగానో ఎదురు చూసే సందర్భం దేదీప్యమాన దృశ్యం. కోటి కాంతుల ఒకేసారి ప్రసరించే దివ్య అనుభవం దీప ప్రజ్వలనం. అలా ఒకటి రెండు దీపాలు కాదు ఏకంగా కోటి దీపాల వెలుగుల మధ్య ఆ పరమేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. మన సాంప్రదాయాన్ని భవిష్యత్తు తరాల వాళ్ళకి కూడా తెలిసే విధంగా 2013 నుంచి భక్తి టీవీ ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే వస్తోంది. అయితే ఈ ఏడాది అనగా 2023 నవంబర్ 14 న మొదలయ్యి నవంబర్ 27 వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం జరగనుంది.
Also Read: Bethavolu Canal : ఊడిన బేతవోలు కాలువ షట్టర్..చేతికందిన పంట నీట మునిగే
Related News

KTR: మెట్రో రైలులో కేటీఆర్ ప్రయాణం.. ప్రయాణికులతో మాట ముచ్చట!
వివిధ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు మెట్రోలో ప్రయాణించారు.