Kitchen Tips: వంటగదిలో ఈ ఫోటో పెట్టుకుంటే చాలు.. అదృష్టం పట్టిపీడిస్తుంది?
చాలామంది వంటగది విషయంలో తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వాస్తు ప్రకారంగా చేసే తప్పులు మనం అనుభవించే బాధలకు కూడా
- By Nakshatra Published Date - 08:30 PM, Mon - 17 July 23
చాలామంది వంటగది విషయంలో తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వాస్తు ప్రకారంగా చేసే తప్పులు మనం అనుభవించే బాధలకు కూడా కారణం కావచ్చు. వంటగది అంటే అన్నపూర్ణాదేవి. అందుకే వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. వంట పూర్తయిన వెంటనే వంటగదిని శుభ్రం చేసుకోవాలి.. అలా చేయకపోతే అన్నపూర్ణాదేవి అలిగి వెళ్లిపోతుంది. దాంతో ఇంట్లో ఆహార సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా తలెత్తుతాయి. అలా ఆ ఇంట్లో నెమ్మదిగా ఆహార నిల్వలు తగ్గిపోతాయి. రకరకాల సమస్యలు జీవితాన్ని చుట్టుముడుతాయి.
ఇంకా వంటగది విషయంలో ఎటువంటి విషయాలు పాటించాలి? వంట గదిలో ఎటువంటి ఫోటో పెట్టుకోవడం వల్ల మంచి కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంట్లో ఆహార నిల్వలు ఎన్నటికీ తరిగిపోవు. వంటింట్లో తయారైన ఆహారం ఆరోగ్యం అందించేదిగా ఉంటుంది. వంట చేసే సమయంలో కోపం ద్వేషం వంటి అపవిత్ర భావనలు రాకుండా ఉంటాయి. అక్కడ తయారైన ఆహారం ఆరోగ్యాన్ని అందించేదిగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు నిలిచి ఉంటాయి. ఈ చిత్రం వంటగదిలో ఎనర్జీని రెట్టింపు చేస్తుంది. ప్రేమానురాగాలతో పాటు కుటుంబ వృద్ధి, మర్యాద పెరుగుతాయి. ఇంట్లో ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తుంది. అన్నపూర్ణ దేవి చిత్రాన్ని వంట గది బయట గోడకి అలంకరించుకున్నపుడు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి.
గురువారం, శుక్రవారం ఉదయం అన్నింటికంటే ముందుగా వంటగదిని శుభ్రం చేసుకోవాలి. గంగా జలం అందుబాటులో ఉన్నవారు తప్పకుండా కాస్త గంగాజలం చల్లుకొని శుద్ధి చేసుకోవాలి చిత్రాన్ని అతికించే ముందు ఆ గోడను శుభ్రం చేసి గంగాజలంతో శుద్ధి చెయ్యాలి. గ్యాస్ స్టవ్ లేదా స్టవ్ మీద ఆహారాన్ని తయారు చేస్తాం. అందుకే తప్పనిసరిగా వంటతయారయ్యే పొయ్యిని తప్పనిసరిగా పూజించాలి. ఇది అన్నపూర్ణ దేవికి చేసే ఉపాసన అవుతుంది. వంట గదిలో ఉన్న అన్నపూర్ణాదేవి సహితుడైన పరమేశ్వరుని పూజించడం వల్ల ఇంటిలో ఆహార కొరత ఎన్నటికీ ఏర్పడదు. అన్నపూర్ణా స్తోత్రం, కథ, హారతి తర్వాత ఈ చిత్రాన్ని వంటగదికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి అనుగ్రహంతో ఇల్లు సమృద్ధిగా ఉంటుంది. వంటింటి పొయ్యి మీద పసుపు, కుంకుమ, అక్షితలు, పువ్వులు, ధూపం, దీపం వెలిగించి పూజ పూర్తి చెయ్యాలి. వంటగది లోనే అన్నపూర్ణ దేవి చిత్రపటం ముందు ఇంటిలో ఆయూరారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరికను విన్నవించుకోవాలి.
Related News
Vegetables: ఫ్రిజ్ లేకుండా కూరగాయలు, పండ్లను తాజాగా ఉంచడం ఎలా.?
వేసవిలో పండ్లు, కూరగాయల తాజాదనం వేసవిలో త్వరగా పాడైపోతుంది. అందుకే వాటిని ఫ్రిజ్లో భద్రపరచడం తప్పనిసరి. అయితే, ఫ్రిజ్లో తినడం అంత ఆరోగ్యకరం కాదు.