Zodiac Signs : బుధుడి తిరోగమనం.. ఆ ఐదు రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు
బుధుడిని గ్రహాల రాకుమారుడు అని కూడా పిలుస్తారు.
- By Pasha Published Date - 01:28 PM, Sat - 3 August 24

Zodiac Signs : బుధుడిని గ్రహాల రాకుమారుడు అని కూడా పిలుస్తారు. జులై 20న సింహరాశిలోకి(Leo Sign) ప్రవేశించిన బుధుడు ప్రస్తుతం అదే రాశిలో తిరోగమనంలో ఉన్నాడు. మరో రెండు వారాల వరకు బుధుడు అదే రాశిలో ఉంటాడు. తదుపరిగా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటివరకు బుధుడి తిరోగమనం వల్ల 5 రాశులవారి జీవితంలో చాలా మార్పులు వస్తాయి. కొందరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
- బుధుడి తిరోగమనం వల్ల మకరరాశి(Zodiac Signs) వారు ఉద్యోగ కెరీర్‌లో, వ్యాపారంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఆ రెండు వారాలు ముగిసేదాకా అలర్ట్‌గా ఉండాలి. సవాళ్లను తెలివిగా ఎదుర్కోవాలి. ఎవరితోనూ వాదనకు దిగొద్దు. మాట్లాడే మాటల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. పెద్దగా ఆర్థిక లావాదేవీలు చేయకపోవడం సేఫ్. ఏదైనా బిజినెస్‌లోకి నేరుగా పెట్టుబడులు పెట్టొద్దు. ముందుగా దాని గురించి రీసెర్చ్ చేయండి. లాభనష్టాలపై ఓ అంచనాకు రండి. ఆ తర్వాతే పెట్టుబడి నిర్ణయాలు తీసుకోండి.
- బుధుడి తిరోగమనం వల్ల మీనరాశివారి పనుల్లో ఆటంకాలు ఏర్పడుతాయి. అయినా ఓపికగా వ్యవహరించాలి.పనిపై నుంచి ఫోకస్ దారిమళ్లుతూ ఉంటుంది. అయినా ఫోకస్డ్‌గా ఉండేందుకు ప్రయత్నించాలి. ఖర్చులు పెరిగే రిస్క్ ఉంది. దాంపత్య జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తే ముప్పు ఉంది. కొన్ని వ్యాపారాల వారికి నష్టాలు వస్తాయి. ఉద్యోగులకు ఆఫీసుల్లో చిక్కులు ఏర్పడే రిస్క్ ఉంది.
Also Read :Suzuki Motorcycle India: సరికొత్త మైలురాయి సాధించిన సుజుకి మోటార్స్..!
- బుధుడి తిరోగమనం వల్ల సింహరాశి వారిని సోమరితనం ఆవరించే అవకాశం ఉంది. అయినా స్వీయ నియంత్రణ ద్వారా చురుగ్గా ఉండాలి. పనులపై ఫోకస్ చేయాలి. పెద్దలు, నిపుణుల సలహాలు లేకుండా కీలక నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు ముందుకు వేయాలి. హెల్త్‌పై శ్రద్ధ పెట్టండి.
- బుధుడి తిరోగమనం వల్ల కన్యారాశికి చెందిన ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి పోటీదారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. అలర్ట్‌గా ఉండాలి. మీరు ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఓపిక వహించండి. తొందరపాటు పనికిరాదు. సన్నిహితులు,ఆప్తుల సహకారంతో సమస్యల పరిష్కారానికి ప్రయత్నించండి.
- బుధుడి తిరోగమనం వల్ల వృషభ రాశివారికి వెరైటీ పరిస్థితులు ఎదురవుతాయి. వీరికి ఆదాయం పెరిగి.. మానసిక ప్రశాంతత తగ్గిపోతుంది. ఓ వైపు వ్యక్తిగత జీవితాన్ని.. మరోవైపు వ్యాపార/ఉద్యోగ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగితే చిక్కులు తొలగిపోతాయి. ఖర్చులు పెరిగిపోయే అవకాశంఉంది. వ్యాపారంలో కొత్త వారిని వెంటనే నమ్మేయొద్దు. దాంపత్య జీవితంలో కొన్ని ఆటంకాలు ఎదురుకావచ్చు.
Also Read :CM Revanth : అమెరికాకు బయలుదేరిన సీఎం రేవంత్
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.