Vathu Tips: సంపదకు లోటు ఉండకూడదంటే ఈ వస్తువులు మీ ఇంట్లో ఉండాల్సిందే!
వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని రకాల వస్తువులు పెట్టుకోవడం మంచిదని చెబుతున్నారు.
- By Anshu Published Date - 02:00 PM, Thu - 29 August 24

మనలో చాలా మంది వాస్తు విషయాలను పాటిస్తూనే ఉంటారు. వాస్తు నియమాలను పాటించడం వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని చాలామంది చెబుతూ ఉంటారు. ముఖ్యంగా వాస్తు ప్రకారం గా కొన్ని రకాల వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం వల్ల సంపదకు ఎలాంటి లోటు ఉండదు అని చెబుతూ ఉంటారు. మరి సంపదకు లోటు ఉండకుండా ఉండాలంటే ఇంట్లో ఇలాంటి వస్తువులను ఉంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాస్తు ప్రకారం మన ఇంట్లో ఉండాల్సిన వస్తువులలో మట్టి కుండ కూడా ఒకటి. ఈ మట్టి కుండలో ఎప్పుడూ తూర్పు వైపున ఏర్పాటు చేసుకొని అందులో నీళ్లు నింపి తాగడం మంచిది.
ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో సంపద ఆనందం వెళ్లి విలుస్తాయట. ఇంట్లోని ఉత్తరం దిశలో తులసి మొక్కలు నాటుకోవడం వల్ల సంపదకు ఆటంకాలు ఏర్పడవు అని చెబుతున్నారు. అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎల్లప్పుడూ ఉంటుందట. కేవలం తులసి మొక్కలు నాటడం మాత్రమే కాకుండా దానికి ఎల్లప్పుడూ పూజలు చేస్తూ ఉండాలని చెబుతున్నారు. అదేవిధంగా ఇంట్లో లోహపు తాబేలు బొమ్మ ఉత్తరం వైపు ముఖం చేసి ఉండేలా అమర్చుకోవాలి. ఇలా అమర్చిన తాబేలు ఇంట్లోకి సంపద, సమృద్ధి, సంతోషాన్ని తెస్తుందని వాస్తు చెబుతోంది. ఇంట్లో నారింజ మొక్క ఉండడం వల్ల సంపదతో పాటు సంతోషం కూడా వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే నల్లని గుర్రపు డెక్కను ఇంటి ప్రధాన ద్వారానికి బిగించుకుంటే అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం.
ఇది ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ చేరకుండా నిరోధిస్తుంది. ఇంట్లో ఆర్థిక ప్రతిష్టంభన లేకుండా చేస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా ఇంట్లో ఉండాల్సిన వస్తువులలో లోహపు చేప ప్రతిమ కూడా ఒకటి. ఆర్థిక లోటు లేకుండా ఉండేందుకు ఈ లోహపు చేప ప్రతిమ తోడ్పడుతుంది. ఇది ఇంట్లో సంతోషాలు నిలిచి ఉండేందుకు తోడ్పడుతుందట. అలాగే లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంట్లో ఎల్లప్పుడూ ఉత్తరం వైపు ఉత్తరం వైపు చూసే విధంగా అమర్చుకోవాలట. పద్మంలో ఆసీనురాలై ఉన్న లక్ష్మీ విగ్రహం నుంచి బంగారు నాణేలు వర్షిస్తూ ఉండే భంగిమలో ఉంటే మరీ మంచిది. ఇది అవకాశాలను అందిస్తుందని, సంపదను, సంతోషాన్ని ఇంట్లోకి ఆహ్వానిస్తుందని చెబుతున్నారు. అలాగే మెరుపులీనుతున్న క్రిస్టల్ బాల్స్ ఇంటి కిటికిలో లేదా ముఖద్వారానికి వేలాడదీయ్యడం ద్వారా ఇంట్లోకి సంపద వెల్లువలా వస్తుందని వాస్తు చెబుతోంది. రాగితో లేదా ఇత్తడి లేదా వెండితో చేసిన పిరమిడ్ ఇంట్లో ఉండే భవిష్యత్తు బంగారు మయం చేస్తుందట. కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చునే చోట ఈ పిరమిడ్ ఏర్పాటు చేసుకోవడం మరింత మేలుచేస్తుంది. పిరమిడ్ ఉన్నంత కాలం ఇంట్లో ఆనందం, సంపద నిలిచి ఉంటాయని వాస్తు చెబుతోంది.