HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Karwa Chauth Pooja And Its Auspicious Date

Karwa Chaut: కర్వా చౌత్ ఎప్పుడు ? పూజా సమయం.. పూజా విధానమేంటి ? లాభాలు ఏమిటి ?

"కర్వా చౌత్".. ఒక స్పెషల్ పండుగ.

  • By Hashtag U Published Date - 06:30 AM, Mon - 3 October 22
  • daily-hunt
Karwachaut Imresizer
Karwachaut Imresizer

“కర్వా చౌత్”.. ఒక స్పెషల్ పండుగ.
దీన్ని ఏటా దీపావళికి పది రోజులు ముందు వచ్చే పండగ. ఉత్తరాది ప్రజలు “కర్వా చౌత్” ను ఎంతో వేడుకగా జరుపుకొంటారు. ఈ ఫెస్టివల్ ను యుగయుగాలుగా జరుపుతున్నారు.పాండవుల శ్రేయస్సు, దీర్ఘాయువు కోసం ద్రౌపతి కర్వా చౌత్ ఉపవాసం పాటించారని అంటారు. పార్వతి శివుని కోసం ఇదే ఉపవాసం పాటించారని చెబుతారు. ఇవే కాకుండా ఈ పండుగ ఎలా ప్రారంభమైందనే దానిపై వివిధ కథలు ప్రచారంలో ఉన్నాయి. ఉత్తర భారతదేశంలోని పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ మరియు కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ మొదలైన రాష్ట్రాల్లో ఈ ఉపవాసాన్ని ఆచరిస్తారు.

“కర్వా చౌత్” రోజున..

కర్వా చౌత్ పండుగను కార్తీక మాసంలోని కృష్ణపక్షం 4వ రోజున జరుపుతారు. ఆధునిక క్యాలెండర్ ప్రకారం ఇది సాధారణంగా అక్టోబర్/నవంబర్ నెలలో వస్తుంది.
ఆ రోజున వివాహిత స్త్రీలు తమ భర్తల క్షేమం, దీర్ఘాయువు కోసం ఉపవాసం ఆచరిస్తారు. రోజంతా వ్రతం ఆచరించి.. సాయంత్రం గిన్నెలో నీళ్లు తీసుకుంటారు. ఓ పళ్లెంలో గోధుమలు నింపి పార్వతీ దేవి పూజ చేస్తారు. దాంతోపాటు వ్రతం కధ వింటారు. ఆ తరువాత రాత్రి చంద్రోదయం తరువాత వ్రతం వదులుతారు. ఉదయం నుంచి ఉపవాసముండి, సాయంత్రం చంద్రుడికి పూజ చేసి.. ఆకాశంలో చందమామ రాగానే ఒక జల్లెడ చాటున భర్తను చూడటం ఈ పండుగలో విశేషం. ఈ విధంగా చేయడం వల్ల తమ భర్త క్షేమంగా ఉంటాడని భర్య విశ్వాసం. జల్లెడ చాటున భర్తను చూసి ఆ తర్వాత తన ఉపవాస దీక్షను విరమిస్తుంది భార్య.ఆరోగ్యవంతులైన మహిళలు ఈ వ్రతం రోజున నీళ్ళు కూడా ముట్టరు. అయితే గర్భిణీ మహిళలు లేదా ఆరోగ్య సంబంధ సమస్యలున్నవారు మాత్రం వ్రతం సందర్భంగా పండ్లు తినవచ్చు. ఇక పెళ్లికాని అమ్మాయిలైతే తమకు మంచి భర్త రావాలని పూజలు చేస్తారు.

ఈసారి కర్వా చౌత్ ఎప్పుడు ?

ఈసారి కర్వా చౌత్ వ్రతం అక్టోబర్ 13 వతేదీన ఉంది. పూజకు అనువైన శుభ ముహూర్తం కూడా ఇదే రోజు. కార్తీక మాసం చతుర్ధి తిధి అక్టోబర్ 13న 1 గంట 59 నిమిషాలకు ప్రారంభమై…అక్టోబర్ 14వ తేదీ ఉదయం 3 గంటల 8 నిమిషాల వరకూ ఉంటుంది. ఉదయ తిధి లెక్కల ప్రకారం అక్టోబర్ 13న జరుపుకుంటారు.
కర్వా చౌత్ నాడు పూజ కోసం అక్టోబర్ 13 వ తేదీ 5 గంటల 54 నిమిషాల నుంచి 7 గంటల 9 నిమిషాల వరకూ శుభ ముహూర్తంగా ఉంది. కర్వా చౌత్ నాడు చంద్రోదయ సమయం రాత్రి 8 గంటల 9 నిమిషాలకుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • asupicious day
  • karwa chaut
  • pooja

Related News

Karthika Pournami

‎Karthika Pournami: కార్తీక పౌర్ణమి రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు.. ముక్కోటి దేవతల అనుగ్రహం కలగడం ఖాయం!

‎Karthika Pournami: కార్తీక పౌర్ణమి రోజున కొన్ని పనులు చేస్తే ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం కలుగుతుంది అని చెబుతున్నారు. మరి ఇంతకీ కార్తీక పౌర్ణమి రోజు ఏమి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Lord Shani

    ‎Shani: శని ప్రభావం వద్దని అనుకుంటున్నారా.. అయితే అదృష్టాన్ని కాలదన్నుకున్నట్లే!

  • Karthika Masam

    ‎Karthika Masam: కార్తీకమాసంలో బ్రహ్మ ముహూర్తంలో లేచి ఒక్క పని చేస్తే చాలు.. అదేంటో తెలుసా?

  • Karthika Masamm

    ‎Karthika Masam: అదృష్టం, ఐశ్వర్యం కోసం కార్తీకమాసంలో ఎలాంటి నియమాలు పాటించాలో మీకు తెలుసా?

Latest News

  • Vitamin Deficiency: కోపం, చిరాకు.. ఏ విటమిన్ లోపం వల్ల వస్తాయి?

  • ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్‌కు బిగ్ షాక్‌.. రోహిత్ శర్మదే అగ్రస్థానం!

  • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

  • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

  • Warning Bell : ట్రంప్ కు వార్నింగ్ బెల్!

Trending News

    • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

    • Kartik Purnima: రేపే కార్తీక పౌర్ణ‌మి.. ఏ రాశి వారు ఎలాంటి వ‌స్తువులు దానం చేయాలో తెలుసా?

    • India Post Payments Bank: ఇక‌పై ఇంటి నుండే ఆ సర్టిఫికేట్ పొందవచ్చు!

    • Rs 2,000 Notes: మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా రూ. 2 వేల నోట్లు!?

    • Net Worth: భార‌త్‌, సౌతాఫ్రికా జ‌ట్ల కెప్టెన్ల సంపాద‌న ఎంతో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd