Karungali Mala: కరుంగళి మాల ధరించాలనుకుంటున్నారా.. అయితే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
Karungali Mala: కరుంగళి మాల దరించాలి అనుకున్న వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని, అలాగే కొన్ని నియమాలను పాటించాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:30 AM, Sun - 5 October 25

Karungali Mala: ఇటీవల కాలంలో అనగా ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ అలాగే సోషల్ మీడియా యాప్స్ లో ఎక్కడ చూసిన కూడా ఎక్కువగా వినిపిస్తున్న పేరు కరుంగళి మాల. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ కరుంగళి మాల ధరిస్తున్నారు. అయితే చాలామందికి ఈ కరుంగళి మాల గురించి పూర్తి వివరాలు తెలియవు. వాటి గురించి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కరుంగలి పూసలు నల్లమల అనే చెక్కతో తయారు చేస్తారు. కారుకలి మాల అనే చెట్టు నుంచి తయారు చేస్తారు. కారుకలి చెట్టుకి విద్యుత్ అయస్కాంత కంపనాలను ఆకర్షించే శక్తి ఉంటుందట.
అందుకే ఈ చెక్కను ఆలయ గోపురాలు, విగ్రహాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కారుకలి చెట్టు నుంచి వచ్చిన చెక్కతో తయారైన కరుంగలి మాల ధరించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ చెట్టు బెరడును, వేరును ఆయుర్వేద మందుల తయారీలో వినియోగిస్తారు. కాగా జోతిష్య శాస్త్ర ప్రకారం నల్లని రంగు కుజుడికి , శనికి సంబంధించినది. కరుంగలి మాలతో జపం చేయడం వల్ల, మెడలో ఆభరంగా ధరించడం వల్ల గ్రహాల ప్రతికూల ప్రభావం కూడా తగ్గిపోతుందని విస్వసిస్తారు. జాతకంలో కుజుడి ప్రభావం ఉంటే రక్త సంబంధిత వ్యాధులు ఉంటాయి.
వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఉంటాయి. వాటిని తొలగిస్తుంది ఈ మాల. దిష్టి, దుష్టశక్తులు, ప్రతికూల శక్తులు ఉన్నాయని విశ్వశించేవారు కరుంగలి మాల ధరిస్తే వాటినుంచి రక్షణ లభిస్తుందట. జపం చేసే అలవాటు ఉన్నవారు కరుంగలి మాలను వినియోగిస్తే మానసిన ప్రశాంతత చేకూరుతుందట. ఏకాగ్రత మరింత పెరుగుతుందట. నిత్యం కరుంగలి మాలను నియమాలు పాటిస్తూ ధరిస్తే భూ సంబంధిత వివాదాలు, కోర్టు సంబంధిత వివాదాలు, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పోతున్నారు. కరుంగలి మాలను మంగళవారం వేసుకోవడం మంచిదట. బుధవారం, గురువారం, శుక్రవారం, శని వారాల్లో పంచమి, ఏకాదశి, పౌర్ణమి కలిసొచ్చినప్పుడు ఈ మాల వేసుకోవచ్చట.
ఎప్పుడు అయిన సరే కరుంగలి మాల ధరించేముందు నీటితో, పాలతో కడగాలట. తర్వాత దేవుడి దగ్గర పెట్టాలని, పంచామృతాల్లో కాసేపు ఉంచాలని, అనంతరం సుబ్రహ్మణ్య స్వామి, వారాహి అమ్మవారి దగ్గర ఉంచి పూజించి మాలను ధరించాలని చెబుతున్నారు. రుద్రాక్ష ధరించినప్పుడు మద్యం, మాంసం ముట్టుకోకూడదట. మైల సమయంలో వేసుకోకూడదట. అలాగే రాత్రి నిద్రపోయేటప్పుడు మెడలో ఉంచుకోకూడదట. నేరుగా నేలపై ఉంచకూడదట. ఇవే నియమాలు కరుంగలి మాలకు కూడా వర్తిస్తాయట. అయితే కరుంగలి మాల కొనుగోలు చేసిన 11 రోజులు లేదా 21 రోజులు లేదంటే 108 రోజులు ప్రత్యేక పూజ చేసి ధరిస్తే ఇంకా మంచి శుభఫలితాలు కనిపిస్తాయట.