Karthika Purnima 2024: కార్తీక పౌర్ణమి ఎప్పుడు.. ఆరోజు ఏం చేయాలో మీకు తెలుసా?
కార్తీక పౌర్ణమి రోజు కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 11:39 AM, Tue - 5 November 24

కార్తీక మాసంలో హిందువులు భక్తిశ్రద్ధలతో శ్రీమహావిష్ణువుతో పాటు పరమేశ్వరుని పూజిస్తూ ఉంటారు. కాగా ఈ మాసాన్ని మాసం శివ, కేశవులకు ఎంతో ప్రీతీకరమైందని చెప్పవచ్చు. నెలరోజుల పాటు దీపారాధాన చేయడం వల్ల అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు పండితులు. మరి ముఖ్యంగా కార్తీక మాసంలో సూర్యోదయాన్ని కంటే ముందు నిద్ర లేచి స్నానం ఆచరించి ఇంట్లో దీపారాధన చేసి ఆ తర్వాత ఆలయంలో దీపాలు వెలిగించాలని చెబుతున్నారు. కార్తీక మాసంలో అన్నింటికన్న కూడా పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెబుతుంటారు.
ఈ రోజున చేసే పనులు వంద రెట్లు మంచి ఫలితాలను ఇస్తాయట. ఇకపోతే ఈ ఏడాది అనగా 2024 లో కార్తీక పౌర్ణమి నవంబరు 15 వ తేదీ రోజు వచ్చింది. ఈ రోజంతా చాలా మంచి రోజని పండితులు చెబుతున్నారు. ఈ రోజు ఎలాంటి పనులు చేసిన అవి ఆగకుండా పూర్తవుతాయట. అంతే కాకుండా ఈ రోజు ముఖ్యంగా 365 వత్తులతో దీపారాధన చేయడం వల్ల, సంవత్సరంలో మనం దీపారాధన చేయకున్న ఈ ఒక్కరోజు దీపం వెలిగిస్తే ఏడాది దీపం పెట్టిన పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు.
అదే విధంగా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి పండు లేదా సాలగ్రామం దానంగా ఇవ్వాలటీ ఆవులకు పశుగ్రాసం దానంగా ఇవ్వాలి. ఈరోజు ఉపవాసం ఉంటే కూడా ఎంతో పుణ్యమని చెబుతున్నారు. అలాగే దీపాలను వెలిగించడంతో పాటు దానధర్మాలు చేయడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుందట. ఉదయం సూర్యాస్తమయం సమయంలో ఇంటి పదానముఖ ద్వారం వద్ద దీపాలను వెలిగించాలని చెబుతున్నారు.