Amla Tree: కార్తీకమాసంలో ఉసిరి చెట్టు కింద ఎందుకు భోజనాలు చేయాలో తెలుసా?
కార్తీకమాసంలో ఉసిరి చెట్టుకి పూజ చేయడం అలాగే భోజనం చేయడం వెనుక ఉన్న కారణాల గురించి తెలిపారు.
- By Anshu Published Date - 03:04 PM, Tue - 5 November 24

హిందూమతంలో కార్తీక మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ కార్తీక మాసంలో విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు. అలాగే మగవారు మాలలు ధరిస్తూ ఉంటారు. స్త్రీలు నది స్నానాలు ఉదయాన్నే కార్తీక స్నానాలు చేసి దీపాలను వెలిగిస్తూ ఉంటారు. ముఖ్యంగా పరమేశ్వరుడిని అలాగే శ్రీమహావిష్ణువుని ఈ నెల అంతా భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అలాగే ఉసిరి చెట్టు ని కూడా పూజిస్తూ ఉంటారు. అలాగే ఎప్పటినుంచో కార్తీకమాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం అన్న విషయం కూడా పాటిస్తూ వస్తున్నారు. మరి ఉసిరి చెట్టు కింద భోజనం ఎందుకు చేస్తారు? ఈ ఆనవాయితీ ఎందుకు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవిలు కొలువై ఉంటారని చెబుతుంటారు. దేవుళ్ళు ఉన్న కాలంలో దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన యుద్ధంలో అమృత బిందువులు భూమి మీద పడ్డాయని, అప్పుడే ఈ ఉసిరి చెట్టు పుట్టిందనే నమ్మకం. ఈ ఉసిరి చెట్టును భూమాతగా కూడా కొలుస్తారు. ఈ చెట్టును ధాత్రి వృక్షం అని కూడా పిలుస్తారు. ఉసిరి ఆరోగ్యానికి సంజీవనిలాంటిది. అందుకే ఈ చెట్టుకు ఇంతటి ప్రాముఖ్యత ఏర్పడింది. ఉసిరి చెట్టు వేర్లలో శ్రీమహా విష్ణువు, కాండంలో శివుడు, చెట్టుపైన బ్రహ్మదేవుడు, చెట్టు కొమ్మల్లో సూర్యుడు, చిన్న చిన్న కొమ్మల్లో సకల దేవతలు ఉంటారట.
అలాంటి చెట్టుకు తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం దిక్కులలో పాటు ఈశాన్యం వంటి మూలల్లో సైతం ఎనిమిది దీపాలను వెలిగించి చెట్టు చుట్టూ ఎనిమిది ప్రదిక్షణలు చేసి, ఆ చెట్టు కింద భోజనం చేయాలి. ఇలా చేయడం అత్యంత శుభసూచకంగా భావిస్తుంటారు. అలాగే కార్తీక మసమాలో ఉసిరికాయపై ఒత్తులు పెట్టి దీపం వెలిగిస్తుంటారు. ఇలా దీపం పెట్టడం వల్ల శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనదని, ఇలా చేయడం వల్ల విష్ణు కటాక్షం లభిస్తుందని చెబుతున్నారు. ఉసిరి చెట్లు ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలిగి పోతాయట. అలాగే దుష్టశక్తులు కూడా ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయని పండితులు చెబుతుంటారు. అలాగే నరదృష్టి కూడా ఇంటికి తగలకుండా ఉంటుందని చెబుతున్నారు.