Pasupu Kumkuma : పసుపు, కుంకుమలు కిందపడితే అపశకునమా..?
పసుపు, కుంకుమలను శుభసూచికగా పరిగణిస్తుంటాం. ముత్తైదువలు పసుపు, కుంకుమను శుభప్రదంగా భావిస్తుంటారు. శుభాకార్యాల్లో ఎక్కువగా వాడుతుంటారు. సుమంగళీకి గుర్తులు ఈ రెండూ.
- By hashtagu Published Date - 08:15 AM, Sun - 26 June 22
పసుపు, కుంకుమలను శుభసూచికగా పరిగణిస్తుంటాం. ముత్తైదువలు పసుపు, కుంకుమను శుభప్రదంగా భావిస్తుంటారు. శుభాకార్యాల్లో ఎక్కువగా వాడుతుంటారు. సుమంగళీకి గుర్తులు ఈ రెండూ. భారతీయ సంప్రదాయంలో వీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంటికి అతిథులు వస్తే ఏం ఇచ్చిన…ఇవ్వకపోయినా..పసుపు, కుంకుమలను పెట్టి పంపిస్తుంటారు. ఎంతో పవిత్రంగా పసుపు, కుంకుమలను భావిస్తుంటారు. ఏదైనా శుభకార్యానికి ఆహ్వానించినప్పుడు కూడా బొట్టు పెట్టి పిలుస్తుంటారు. పుట్టింటికి వెళ్లిన ఆడపిల్లలు అత్తారింటికి వెళ్లేటప్పుడు పసుపు కుంకుమను సారెగా పంపిస్తుంటారు.
ఈ విధంగా ఎంతో పవిత్రంగా భావించే పసుపు, కుంకమ పొరపాటున చేజారిపడిపోతుంది. అలాంటప్పుడు చాలామందిలో భయం మొదలైతుంది. అదో అపశకునంగా భావిస్తారు. ఏదో చెడు జరుగబోతోందని మదనపడుతుంటారు. అయితే శాస్త్రీయంగా అలాంటివి లేదని పెద్దలు అంటున్నారు. అది కేవలం అపోహమాత్రమే అని చెబుతున్నారు పండితులు.
పసుపు, కుంకమ కిందపడితే ఏం చేయాలి.
ఒకవేళ అనుకోకుండా కుంకుమ చేజారి కిందపడితే…అలా పడినచోట భూదేవికి బొట్టుపెట్టి మిగతా కుంకుమను చెట్లలో వేయాలి. మంగళ, శుక్రవారాల్లో కుంకుమ కిందపడిందంటే..చాలా బాధపడుతుంటారు. కానీ అస్సలు బాధపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు జ్యోతిశ్యశాస్త్ర పండితులు. ఆ రోజు ఇంటికి వచ్చిన ముత్తైదువుకు బొట్టుపెట్టి పంపించాలి. ఏదైనా పూజ, వ్రతం చేస్తున్నప్పుడు కుంకుమ, పసుపు చేజారిపడినా అది ఎంతమాత్రం అపశకునం కాదు. కిందపడితే ఎలాంటి అశుభం కాదట..అస్సలు చింతించకండి.
Related News
First Night: ఫస్ట్ నైట్ రోజు పాలు తాగడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే?
పెళ్లి తర్వాత జరిగే కార్యక్రమాలలో శోభనం కార్యక్రమం కూడా ఒకటి. ప్రత్యేకంగా ముహూర్తాలు చూసి కూడా ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అయితే ఫస్ట్ నైట్ రోజు అమ్మాయి చేతికి పాల గ్లాసు ఇచ్చి పంపించడం అన్నది ఎప్పటినుంచోడు ఆచారం. అసలు ఫస్ట్ నైట్ రోజు పాలు మాత్రమే ఎందుకు ఇస్తారు? మిగతా రోజులు ఎందుకు ఇవ్వరు అన్న ప్రశ్న చాలా మందికి తలెత్తే ఉంటుంది. పెళ్లి అనేది ప్రతి ఒక్కర�