Sri Ramanavami 2025 : శ్రీరామనవమి రోజున ఇలా చేస్తే అంత శుభమే !
Sri Ramanavami 2025 : హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం వల్ల భయాలు తొలగి ధైర్యం, ఆరోగ్యం కలుగుతాయి.
- By Sudheer Published Date - 09:05 AM, Sat - 5 April 25

రేపు (2025 -ఏప్రిల్ 6న) శ్రీరామనవమి (Sri Ramanavami 2025) పండుగ. ప్రతి ఏడాది శ్రీరామ నవమి ని హిందువులంతా ఎంతో భక్తి శ్రద్దలతో జారుకుంటూ వస్తారు. ఈఏడాది కూడా అలాగే జరుపుకునేందుకు అంత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ పవిత్ర రోజున శ్రీరామచంద్రుని జన్మదినం సందర్భంగా ప్రజలు ఇంట్లోనూ ఆలయాలలోనూ విశేష పూజలు నిర్వహిస్తారు. రామాయణ పారాయణం, రామ నామ జపం, రామరక్షా స్తోత్రం, హనుమాన్ చాలీసా పఠనం చేయడం ద్వారా భక్తులు రాముని అనుగ్రహం పొందగలుగుతారు. సీతారాములకు పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజ చేసి, హారతులు ఇవ్వడం, పానకం, వడపప్పు నైవేద్యం సమర్పించడం పుణ్యఫలాన్ని ఇస్తుంది.
Pawan Kalyan : భద్రాచలం శ్రీరామ నవమి వేడుకలకు పవన్ కళ్యాణ్.. ఏపీ తరపున ముత్యాల తలంబ్రాలు..
శ్రీరాముడు (Sriramudu) దానధర్మాలకు గొప్ప ప్రాముఖ్యతనిచ్చాడు. అందుకే శ్రీరామనవమి రోజున పేదలకు అన్నదానం చేయడం, వస్త్రాలు దానం చేయడం ఎంతో శుభప్రదం. ఇంట్లో దీపారాధన చేసి శ్రీరామ కళ్యాణ ఫోటోను ప్రతిష్టించి పూజించడం ద్వారా ప్రతికూల శక్తులు తొలగి శాంతి వాతావరణం నెలకొంటుంది. తులసి మొక్కకు పూజ చేసి, నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయడం వల్ల పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
Hardik Pandya: చరిత్ర సృష్టించిన ముంబై కెప్టెన్.. లక్నోపై ఐదు వికెట్లతో చెలరేగిన పాండ్యా!
హనుమంతునికి కూడా ఈ రోజున ప్రత్యేక పూజలు చేయాలి. హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం వల్ల భయాలు తొలగి ధైర్యం, ఆరోగ్యం కలుగుతాయి. అలాగే తల్లిదండ్రులు, గురువులకు పాదాభివందనం చేసి ఆశీస్సులు పొందడం వల్ల శ్రీరాముని వంటి విజయాన్ని పొందవచ్చు. శ్రీరాముని జీవితం మనకు నైతికత, విధేయత, ధర్మ నిష్ఠకు ఆదర్శం. ఆయన ఆచరణలను మన జీవితంలో అనుసరిస్తే నిజమైన శుభం లభిస్తుంది. శ్రీరామనవమి రోజున చేసే ప్రతీ సత్సంకల్పం జీవితాన్ని ప్రకాశింపజేస్తుందని పండితులు చెబుతున్నారు.