Nagula Chavithi: పాములు పూజించడం మూఢనమ్మకమా.. అసలు పుట్టలో పాలు పోయకూడదా?
నాగుల చవితి రోజు పుట్టక పాలు పోయడం నాగదేవతను పూజించడం అన్నది ఎప్పటినుంచో వస్తున్న ఆచారం. హిందువులు ఈ నాగుల చవితిని గొప్ప
- By Nakshatra Published Date - 09:20 PM, Sun - 20 August 23
నాగుల చవితి రోజు పుట్టక పాలు పోయడం నాగదేవతను పూజించడం అన్నది ఎప్పటినుంచో వస్తున్న ఆచారం. హిందువులు ఈ నాగుల చవితిని గొప్ప పండుగలా కూడా జరుపుకుంటూ ఉంటారు. నాగుల చవితి రోజున నాగ దేవతకు ఇష్టమైన ఆహారాలను సమర్పించి అమ్మవారికి పాలతో అభిషేకాలు చేయడం పుట్టిన పాలు పోయడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఈ తరం వారు అలా పుట్టలో పాలు పోయడం ఏంటి మూర్ఖత్వం కాకపోతే అలా నాగులచవితి ఇవన్నీ మూఢనమ్మకాలే అని వాటిని కొట్టిపారేస్తూ ఉంటారు. కానీ పూర్వం వారు మాత్రం ఇది దరతరాలుగా వస్తున్న సంప్రదాయం అని వాటిని కొనసాగిస్తూనే ఉంటారు.
మరి ఈ విషయం గురించి క్లారిటీ రావాలంటే పురాణాల్లో ప్రస్తావించిన కొన్ని విషయాలను తెలుసుకోవాల్సిందే. ఈ విషయం గురించి శ్రీకృష్ణుడు మాట్లాడుతూ.. నేను నాగులలో అనంతుడిని, జలచరాలలో వరుణుడిని, పిత్రులలో ఆర్యముడిని, సంయమవంతుల్లో నిగ్రహాన్ని. అంటూ ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు తాను నాగుల్లో అనంతుడనని చెబుతాడు. అనంతుడు అంటే ఆదిశేషుడు. అనంతుడు కద్రువకు పెద్ద కొడుకు, వాసుకి రెండో కొడుకు. కద్రువ వినతకు చేసిన అన్యాయానికి చింతించి విష్ణువు గురించి ఘోర తపము ఆచరించి ఆయనను తనమీద విశ్రాంతి తీసుకునేలా వరం పొందుతాడు. అనంతుడి బలాన్ని చూసిన బ్రహ్మ భూభారాన్ని మోయమని చెబుతాడు. పురాణాల ప్రకారం అనంతుడు అదృశ్యంగా ఈ భూతలాన్ని మోస్తూ ఉంటాడు.
ఈ అనంతుడే వివిధ అవతారాల్లో స్వామివారిని అనుసరించాడని చెబుతారు. కాగా రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరాముడిగా, వేంకటేశ్వర అవతారంలో గోవిందరాజులుగా, భక్తి మార్గాన్ని తెలపడానికి భగవద్ రామానుజులుగా అనుసరించాడని పురాణాలు చెబుతున్నాయి. సర్పాలు-నాగులకు వ్యత్యాసం ఏంటి అన్న విషయానికి వస్తే.. కృష్ణుడు సర్పాల్లో వాసుకి అన్నాడు. నాగుల్లో అనంతుడు అన్నాడు. అంటే సర్పాలు నాగులు ఒకటి కాదా ? ఏంటి తేడా అనే సందేహం వచ్చి ఉంటుంది. కొంతమంది పండితులు సర్పాలంటే విషపూరితాలు అని , నాగులు అంటే విషరహిత పాములు అని ప్రతిపాదించారు. కానీ పురాణాల ప్రకారం సర్పాలు, నాగులు సోదర సమానులైనా రెంటికీ చాలా వ్యత్యాసం వుంది. నాగులు కామరూపధారులు. అవి కావాలనుకున్నప్పుడు మానవ రూపంలో కనబడగలవు. మానవరూపాన్నే కాదు, ఏ రూపాన్నైనా ధరించగలవు.
సర్పాలు అలా కావు, అవి నేలను అంటిపెట్టుకుని పాకుతాయి, భూమి మీద తిరుగాడుతాయి. నాగులకు ఒక విశిష్ట లోకం వుంది. నాగులకు వాయువు ఆహారం అంటే కేవలం గాలిని పీల్చి మాత్రమే బతుకుతాయి. సర్పాలకు జీవరాశులు ఆహారం. సర్పాల్లో దేవతాసర్పాలు ప్రత్యేకంగా ఉంటాయి. దేవతాసర్పాలు ఎక్కడ ఉంటే అక్కడ మల్లెపూల వాసన వస్తుందట. ఇవి మానవజాడలకు దూరంగా ఉంటాయి. మనిషికి గానీ, పాములు పట్టేవాళ్ళకు గాని చిక్కవు. పాములు పాలు త్రాగవన్నమాట నిజం. అవి సరిసృపాలు కాబట్టి వాటికి జీర్ణవ్యవస్థ ఉండదు. కానీ నాగులు, దేవతాసర్పాలు అందుకు భిన్నంగా ఉంటాయి. భక్తికి మెచ్చిన నాగదేవతలు అనేకరూపాల్లో దర్శనమిచ్చి పూజలు అందుకుంటాయి.
ఆరోగ్యాన్ని, సంతానాన్ని అనుగ్రహిస్తాయి. దేవతాసర్పాలకు కూడా శక్తులు ఉంటాయి. అవి కొన్ని ప్రత్యేకమైన క్షేత్రాల్లో ఇప్పటికి ఉన్నాయని హిందువుల విశ్వాసం. మనుషులతో కలసి తిరిగే నాగదేవతలు నాగపంచమి, నాగుల చవితి లాంటి నాగదేవత ఆరాధన తిధుల సమయంలో నాగులు కూడా మనుషులతో కలసి సంచరించేవట. ఎందుకంటే అప్పట్లో మానవులకు శౌచం ఉండేది. ధర్మనిష్ఠ, సత్యనిష్ఠ, దైవభక్తి ఉండేది. పాలు, పండ్లు సమర్పించి, పసుపు కుంకుమలు, సారెలతో పూజించి, వారిని సంతోష పెట్టేవారు. క్రమక్రమంగా ప్రజల్లో శౌచం తగ్గిపోవడం, ధర్మంపై శ్రద్ధ తగ్గి, ఆచరణ తగ్గిపోయిన కారణంగా నాగులు ఇంతకముందులా మనుషుల వలే శరీరంతో సంచరించడం మానేశాయట. అందుకే విగ్రహాల్లో వారిని ఆవాహన చేసి పూజించినా సత్ఫలితాలు ఇస్తాయంటారు. ఇప్పుడు బయట కనిపించే పుట్టల్లో ఉండేవి దేవతాసర్పాలని చెప్పలేం. చాలావరకూ మామూలు పాములే. అందుకే నాగదేవతలను పూజించవలసి వచ్చినప్పుడు నాగప్రతిష్ట, నాగబంధం, నాగశిలలను మాత్రమే పూజించమని ధార్మిక గ్రంధాలు తెలిపాయి.
Related News
Snake: కలలో పాములు పదేపదే కనిపిస్తున్నాయా.. దాని అర్థం ఇదే?
మామూలుగా కలలు రావడం అన్నది సహజం. మనకు కలలో అనేక రకాల జంతువులు పక్షులు మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. అయితే చాలామందికి కొన్ని రకాల కలలు పదేపదే రావడం కలలో జంతువులు పదేపదే కనిపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కొందరికి తరచుగా ఆ కలలో పాములు కనిపిస్తూ ఉంటాయి.. మరి అలా కనిపించడం దేనికి సంకేతం?అలా కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కలలో పాములు కనిపించడానికి రాహు, కేతు దశ�