Holi: హోలీ పండుగ రోజు ఈ చిన్న పనులు చేస్తే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే?
ఆర్థికపరమైన ఇబ్బందులు అలాగే ఇంట్లో ఉండే కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడాలి అంటే హోలీ పండుగ రోజు తప్పకుండా కొన్ని రకాల చిన్న చిన్న పనులు చేయాల్సిందే అంటున్నారు పండితులు.
- By Anshu Published Date - 11:00 AM, Wed - 12 March 25

చిన్నా పెద్ద అని తేడా లేకుండా సెలబ్రేట్ చేసుకోనే పండుగలలో కూడా హోలీ పండుగ కూడా ఒకటి. ప్రతి ఏడాది ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున ఈ హోలీ పూర్ణిమను జరుపుకుంటారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ ఏడాది అనగా 2025 లో మార్చి 14వ తేదీన ఈ పండుగను జరుపుకోనున్నారు. ఈ హోలీ పండుగ ముందు రోజు కాముడు అని పండుగను నిర్వహిస్తూ ఉంటారు. హోలీ పండుగ రోజు కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల జీవితంలో ఉండే కొన్ని కష్టాల నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు.
మరి అందుకోసం హోలీ పండుగ రోజు ఏం చేయాలో ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హోలీ పండుగ రోజున ఉదయాన్నే తల స్నానం చేసి, పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలట. ఆ తర్వాత ఈ రోజున కొన్ని ముఖ్యమైన పనులు చేయడం వలన లక్ష్మి దేవి అనుగ్రహం కలుగుతుందట. ఈ హోలీ పండుగ రోజున పండ్లను దానంగా ఇవ్వాలని చెబుతున్నారు. అలాగే పేదలకు అన్నదానం చేయడం కూడా మంచిదని చెబుతున్నారు. ఇప్పుడు త్వరలోనే వేసవి కాలం మొదలవుతుంది కాబట్టి హోలీ పండుగ రోజున గొడుగు చెప్పులు వంటివి ధానం చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయట.
అలాగే, ఖాళీ ప్రదేశాలలో కుండలు, చలి కేంద్రాలను ఏర్పాటు చేయాలట. ఇలా చేస్తే ఆర్ధిక సమస్యల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. అదే రోజున హోలీ బియ్యం, నవ ధాన్యాలను పండితులకు దానంగా ఇవ్వాలట. ప్రస్తుతం చాలా మంది రంగుల్ని నీళ్లతో కలిపి వేస్ట్ చేస్తుంటారు. కానీ అలా చేయోద్దని చెబుతున్నారు. నీటిని వేస్ట్ చేస్తే వరుణుడి వలన అనేక ఇబ్బందులు వస్తాయట. ఈ హోలీ పండుగ రోజున పేదలకు ఏమీ లేని వారికి తీపి పదార్థాలను దానంగా ఇవ్వడం మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా హోలీ పండుగ రోజున హెయిర్ కట్ చేసుకోవడం గోల్డ్ కత్తిరించడం లాంటివి అస్సలు చేయకూడదట. ఈ విధంగా పైన చెప్పిన పరిహారాలను పాటించడం వల్ల తప్పకుండా అంతా మంచి జరుగుతుందని చెబుతున్నారు.