Ganesh Chaturthi 2025: చవితి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బే డబ్బు..!
Ganesh Chaturthi 2025: ప్రతిరోజూ దీపం వెలిగించి, గణపతి మంత్రాలు జపించడం వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. మట్టి విగ్రహానికి మోదకాలు, లడ్డూలు నైవేద్యం సమర్పించి, వాటిని కుటుంబంతో పంచుకోవడం శుభఫలితాలను ఇస్తుంది. ఆఫీసుల్లోనూ క్యాష్ కౌంటర్, లాకర్ ఉత్తర దిశలో ఉంచడం
- By Sudheer Published Date - 09:23 AM, Wed - 27 August 25

Ganesh Chaturthi : వినాయక చవితి సందర్భంగా వాస్తు నియమాలను పాటించడం ద్వారా ఇంట్లోనూ, ఆఫీసులోనూ సానుకూల శక్తిని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వినాయకుడి విగ్రహాన్ని ఇంటి ఈశాన్య దిశలో ఉంచడం అత్యంత శుభప్రదమని భావిస్తారు. విగ్రహం తూర్పు లేదా పడమర వైపు చూసేలా ఉంచితే సంపద, ఐశ్వర్యం పెరుగుతుందని విశ్వాసం. బాత్రూమ్ దగ్గర, చీకటి మూలల్లో, మెట్ల కింద విగ్రహాన్ని ఉంచకూడదని వాస్తు శాస్త్రం సూచిస్తోంది.
వినాయకుడి విగ్రహం మట్టి లేదా పర్యావరణానికి హాని చేయని పదార్థాలతో చేయబడినదై ఉండటం మంచిది. ఇంటి కోసం ఎడమ తొండం ఉన్న వినాయకుడు శాంతి, స్థిరత్వాన్ని ఇస్తాడని, ఆఫీసు కోసం కుడి తొండం ఉన్న విగ్రహం ఆర్థికాభివృద్ధి వేగవంతం చేస్తుందని నమ్మకం. అలాగే కూర్చున్న వినాయకుడు శాంతి, స్థిరమైన ప్రగతికి సూచన కాగా, నిలబడిన వినాయకుడు ఉత్సాహం, విజయం, చురుకుదనానికి ప్రతీకగా భావిస్తారు. విగ్రహం రంగు కూడా ముఖ్యమే. తెల్లని విగ్రహం శాంతిని ఇస్తే, పసుపు లేదా బంగారు రంగు ఐశ్వర్యాన్ని ఇస్తుందని చెబుతారు.
అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద మామిడి ఆకులు, పూలతోరణం కట్టి, పసుపు లేదా కుంకుమతో స్వస్తిక, ఓం వంటి చిహ్నాలను గీయడం శుభప్రదం. ఉత్తర దిశ సంపదకు ప్రాధాన్యత కలిగినదని వాస్తు చెబుతుంది కాబట్టి, అక్కడ కుబేరుడి విగ్రహం, నాణేలు, నీటి గిన్నె లేదా మనీ ప్లాంట్ ఉంచితే ఆర్థిక ప్రవాహం పెరుగుతుందని విశ్వాసం. ప్రతిరోజూ దీపం వెలిగించి, గణపతి మంత్రాలు జపించడం వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. మట్టి విగ్రహానికి మోదకాలు, లడ్డూలు నైవేద్యం సమర్పించి, వాటిని కుటుంబంతో పంచుకోవడం శుభఫలితాలను ఇస్తుంది. ఆఫీసుల్లోనూ క్యాష్ కౌంటర్, లాకర్ ఉత్తర దిశలో ఉంచడం, పని టేబుల్‌పై చిన్న వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మంచి ఫలితాలను ఇస్తాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.